Information: ఈ పనులు చేస్తే జీవితం మాత్రం నాశనమే.. అమ్మాయిలు జర జాగ్రత్త!

Information: సాధారణంగా మన హిందువులు ఎన్నో విషయాలను ఎంతో సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులను చేయడం మంచిది కాదని మరికొన్ని పనులు చేయడం చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో మనం చేసే కొన్ని పనులు కారణంగా దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది.ఈ పనులు కనుక మనం తరచూ చేస్తూ ఉంటే మన జీవితం సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు.మరి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే..

*అమ్మాయిలు నుదుటిపై బొట్టు లేకుండా ఉండడం పరమ దరిద్రం. గడపపై కూర్చుని మాట్లాడటం, నాలుకతో తడిచేసుకుని బొట్టు పెట్టుకోవడం పరమ దరిద్రం.

 

*ఇక ఎడమ చేతితో పిల్లల్ని కొట్టడం కూడా దరిద్రం అలాగని కుడి చేతితో కొట్టడం మంచిది కాదు. ఉతికిన బట్టలు ఉన్నప్పటికీ స్నానం చేసి విడిచిన బట్టలను వేసుకోవడం మంచిది కాదు.

 

*రాత్రిపూట ఇల్లు ఊడవడం మంచిది కాదు. ఇక అన్నం ఎప్పుడు కూడా ఎత్తి పడేయకూడదు. ఇక భోజనం చేసేసమయంలో కాళ్లు కడుక్కోకుండా భోజనం చేయకూడదు. ఇక మంచంపై కూర్చుని భోజనం చేయకూడదు. చాలామంది అన్నం చిన్న చిన్న ముద్దులుగా చేసుకుని గాల్లోకి విసురుతూ నోటితో పట్టుకుంటారు. ఇది కూడా మంచిది కాదు.ఇక అన్నం పెట్టిన తర్వాత ఆలస్యంగా భోజనం చేయడానికి రాకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం మన కోసం ఎదురు చూడకూడదు.

 

*భోజనం చేసిన తర్వాత స్నానానికి వెళ్లడం మంచిది కాదు ఇక సహ పంక్తి భోజనంలో మధ్యలో లేచి వెళ్ళకూడదు. ఇక చాలామంది ఒళ్లో కంచం పెట్టుకొని భోజనం చేస్తుంటారు ఇది కూడా మంచిది కాదు. ఇక పైన కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ కూర్చుంటారు. ఇది కూడా పరమ దరిద్రమని పండితులు చెబుతున్నారు.

 

*ఇక చాలా మంది పెళ్లయిన మహిళలు తమ మంగళసూత్రంతో నారింజ పండ్లు చీని పండ్లను వలుస్తూ ఉంటారు. ఇది అసలు మంచిది కాదు. దీపాన్ని నోటితో ఆపివేయడం ఒకే వత్తితో దీపం వెలిగించడం కూడా మంచిది కాదు.ఇక తరచూ గోళ్లు కనుబొమ్మలు కత్తిరించుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించడం కూడా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టేనని పండితులు చెబుతున్నారు. కనక జీవితంలో ఈ పనులను మాత్రం అసలు చేయకూడదని చేస్తే దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -