Health tips: ఈ జ్యూస్ తాగితే మాత్రం కండరాలు, నరాలు బలంగా ఉంటాయట!

Health tips: దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ దానిమ్మ పండు ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మ పండు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దానిమ్మ పండులో ఐరన్ తో పాటు అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ రసంలో విటమిన్ సి, ఇ, కె, మెగ్నీషియం వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉన్నాయి. ఇది ఆరోగ్య పరంగా అనేక విధాలుగా మేలు చేస్తుంది.

దానిమ్మలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ నరాలు, కండరాలు సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి. దానిమ్మ పండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. దాంతో పాటు ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది.

 

కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ గింజలు తింటే ఒత్తిడి, చిరాకు తగ్గి మానసికోల్లాసం కలుగుతుంది. దానిమ్మ గింజలు తినడం వల్ల చిగుళ్లు గట్టిపడటం, నోరు, గొంతులోని పుండ్లు నయమవుతాయి. దానిమ్మ గర్భవతులకు కలిగే వేవిళ్లను, రక్త క్షీణతను నివారిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -