YCP MLA: ఈ వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తన గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

YCP MLA: ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులను అధిరోహించి అడ్డంగా అవినీతికి తెరలేపినటువంటి ఇద్దరు ఎమ్మార్వోల పై రెవెన్యూ అధికారులు వేటువేసి వారిని ఉన్నఫలంగా బదిలీ చేశారు. అయితే ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ ఇద్దరు తహసిల్దారులను ట్రాన్స్ఫర్ చేయడంతో తమ అక్రమాలకు సులువైన మార్గం లేదని భావించిన శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 10 రోజులపాటు కష్టపడుతూ బదిలీ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ తనకు ఇష్టమైనటువంటి ఆ తహసిల్దారులను తిరిగి అదే ప్రాంతానికి రప్పించుకోవడం పట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి.

శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని రేణిగుంట, ఏర్పేడు త‌హ‌శీల్దార్లు ఎస్‌.శివ‌ప్ర‌సాద్‌, ఆర్వీ ఉద‌య్‌సంతోష్‌ల‌పై కొన్ని నెల‌లుగా తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఎస్ శివప్రసాద్ అవినీతి గురించి కూడా పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు చేశారు. వీళ్లిద్ద‌రి అవినీతిపై జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి.

 

ఇలా ఈ ఇద్దరు ఎమ్మార్వోలు ప్ర‌భుత్వ భూముల్ని అధికార పార్టీ నేత‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డంలోనూ, ప్రైవేట్ ఆస్తుల్ని వివాదంలో ప‌డేసి, అధికార పార్టీ ముఖ్య నేత‌ల‌తో కుమ్మ‌క్కై వారి ఆస్తులను పెంచుకొని ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ ఇద్దరు ఎమ్మార్వోలను ఈ నెల 15న క‌లెక్ట‌రేట్‌కు స‌రెండ‌ర్ చేశారు. వీళ్లిద్ద‌రి అవినీతిపై చీఫ్ సెక్ర‌ట‌రీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్రమంలోనే రేణిగుంట త‌హ‌శీల్దార్‌గా తిరుప‌తి క‌లెక్ట‌రేట్‌లో డి సెక్షన్‌లో ప‌ని చేస్తున్న మ‌హిళా అధికారి ఎం.భార్గ‌విని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రేణిగుంట‌కు , అలాగే ఎస్‌.ద్వార‌క‌నాథ‌రెడ్డిని ఏర్పేడుకు బ‌దిలీ చేశారు.

 

ఇలా ఏ పని చెప్పినా కళ్ళు మూసుకొని పని చేసే అధికారులు తమ దగ్గర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి 10 రోజులపాటు కష్టపడి తిరిగి ఎస్ శివప్రసాద్, ఉదయ్ సంతోష్ తిరిగి యధా స్థానాలకు తీసుకువచ్చారని తెలుస్తుంది అయితే ఎస్ శివప్రసాద్ ప్రస్తుతం ఏర్పడు తాసిల్దారుగా బాధ్యతలు తీసుకోగా ఉదయ్ సంతోష్ రేణిగుంటకు ట్రాన్స్ఫర్ అయినట్లు రాత్రికి రాత్రే అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -