Visakha: విశాఖలో తహశీల్దార్ హత్య వెనుక అసలు నిజాలివేనా?

Visakha: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు అర్ధరాత్రి తాహాసిల్దార్ పై దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు వివరాల్లోకి వెళితే కొమ్మాది లోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసిల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు.కాగా శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు.

 

అనంతరం తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్ తో రమణయ్య పై దాడి చేశాడు దీంతో తీవ్ర గాయాల పాలైన రమణయ్య గొప్ప కూలిపోయాడు అది గమనించిన అపార్ట్మెంట్ వాసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రమణయ్య ను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా రమణయ్య హత్య కేసు కు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డిసిపి మణికంఠ ఆధ్వర్యంలో అనిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ రమణయ్య శ్రీకాకుళం జిల్లా కాగా ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటీవలే రూరల్ నుంచి విజయనగరం జిల్లా బంటుపల్లి కి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు.

 

రాత్రి 10:15 నిమిషాల సమయంలో ఫోన్ రావటంతో కిందికి వచ్చి అపార్ట్మెంట్ గేటు వద్ద ఒక వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయింది భూముల విషయంలో వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు రమణయ్య వీధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని చెబుతున్నారు. అలాగే తహసిల్దార్ పై రాడ్ తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -