KTR: మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

KTR: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి గురించి పలు విషయాలను వెల్లడించారు.హైదరాబాద్ గతంలో కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందనే విషయం గురించి ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. తాను వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నానని కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. తనతో పాటు తన క్లాస్మేట్ కాంతి కిరణ్ అనే అబ్బాయి ప్రస్తుతం కెనడాలో స్థిరపడ్డారని తెలిపారు.

ఇలా కెనడా వెళ్లిన తన స్నేహితుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చారని తెలియజేశారు. తన స్నేహితుడిది గుంటూరు అని కేటీఆర్ తెలిపారు.ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియా వచ్చిన తన స్నేహితుడితో కేటీఆర్ మాట్లాడుతూ గుంటూరు గుర్తుపట్టావా హైదరాబాద్ అయితే గుర్తుపట్టలేవు కానీ గుంటూరు గుర్తుపట్టావా అని అడగడంతో తన స్నేహితుడు మాట్లాడుతూ గుంటూరు పూర్తిగా మారిపోయిందని తెలిపారని చెప్పారు.

 

ఇక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ చాలా మారిపోయిందని కెనడాలో టోరెంటోన్ వంటి సిటీలు కూడా హైదరాబాద్ ముందు తీసి పోతాయని తనకు తిరిగి ఇండియా వచ్చేయాలనిపిస్తుంది అంటూ తన స్నేహితుడు చెప్పారని తెలిపారు.ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఉండగా గుంటూరు విజయవాడ వైజాగ్ కూడా అభివృద్ధి చెందాయని తాను ఇంతకంటే పెద్దగా మాట్లాడనని తెలిపారు.

 

గతంలో కూడా ఓసారి తాను ఇలా ఒక మాట ఏదో మాట్లాడితే దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ నేను ఒక్కసారి మాట్లాడిన మాటను టీవీలలో 50 సార్లు వేసి చావగొట్టారని అందుకే తాను పక్క రాష్ట్రాల గురించి మాట్లాడదలచుకోలేదంటూ ఈ సందర్భంగా కేటీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -