Tender Coconut: కొబ్బరి బొండంలోని కొబ్బరి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఇంకోసారి వదిలిపెట్టరు

Tender Coconut: వేసవి కాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 43 డిగ్రీలకు ఉష్ణోగత్రలు పలు ప్రాంతాల్లో చేరుకున్నాయి. ఎండలకు తోడు ఉక్కబోత కూడా స్టార్ట్ అయింది. దీంతో మధ్యాహ్నం వేళ్లల్లో రోడ్లపై జనసంచారం ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం వస్తుండటంతో శీతలపానియాలకు డిమాండ్ పెరిగింది.

 

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి వంటిని ప్రజలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. దీంతో ఎండాకాలం వచ్చిందంటేనే.. కొబ్బరి బొండం ధరలు పెరుగుతాయి. రోడ్ల పక్కన ఎక్కడ బట్టినా కొబ్బరి బొండం బండ్లు కనిపిస్తాయి. అయితే కొబ్బరి నీళ్లు తాగేసి చాలామంది వెళ్లిపోతారు. అయితే అందులోని కొబ్బరిని తినరు. కానీ కొబ్బరి బోండంలోని కొబ్బరి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

లేత కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. ఫైబర్, మాంగనీస్, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి మినరల్స్ చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే లారిక్ యాసిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుందని, ఎసిడిటీ, గ్యాస్,అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తొలగిస్తుందని చెబుతున్నారు. ఇక ఈ లేత కొబ్బరిలో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు.

 

ఇక లేత కొబ్బరి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుందని, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుందని అంటున్నారు. అలాగే లేత కొబ్బరిలో ఉండే మీడియం చైన్ టైగ్లిజరైడ్స్ బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయని అంటున్నారు. బెల్లీ ఫ్యాట్ ను కలిగించే లక్షణాలు లేత కొబ్బరిలో ఉన్నాయని, అతిగా తినకుండా నిరోధిస్తుందంటున్నారు.

 

ఇక కప్పు లేత కొబ్బరిలో 3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది కండాలను పెంచుతుందని, అలాగే షుగర్ ను కంట్రోల్ లో ఉంచే లక్షణాలు కూడా లేత కొబ్బరిలో ఉన్నట్లు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుందంటున్నారు. అలాగే గర్భిణులకు లేత కొబ్బరి తింటే మంచిందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -