NTR: టీడీపీని గెలిపించడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

NTR: రాజకీయాలు పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీలు ప్రకటించే పథకాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు పార్టీలు తమ మానిఫెస్టోని ప్రకటిస్తాయి. ప్రజలు దీనికే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఓట్లు కూడా అధికంగా ఈ మార్గం ద్వారానే పడుతాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.అందుకోసం టీడీపీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకో జూనియర్ ఎన్టీఆర్ సైతం కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఇప్పటికే అక్కడ రోజుకో గొడవ జరుగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలపై విరుచుకుపడుతోంది. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తోంది. మరోవైపు వైసీపీ 175 టార్గెట్ పెట్టుకుంది. బలంగా పోరాటం చేయాలని వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కూడా ఐక్యంగా పోరాటం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

 

ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినట్లు ఆ మధ్య కాలంలోనే వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలు కలిసి వెళ్తాయని పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇదంతా పక్కకు పెడితే, టీడీపీ రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి పొత్తు లేదా ఒంటరిగానే పోటీ. ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సర్వేలు కూడా చేయిస్తోంది టీడీపీ. మరోవైపు యంగ్ టైగర్ ను కూడా వచ్చే ఎన్నికల ప్రచారంలోకి దింపాలని బలంగా భావిస్తోంది.

 

తారక్ సైతం ఇందుకు అంగీకరించాలని టాక్. పైగా వచ్చే ఎన్నికల్లో ఇచ్చే హామీల పథకాలను కూడా జూనియర్ డిజైన్ చేశారని తెలిసింది. వీటితో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు సాధించవచ్చని చంద్రబాబుకు ఎన్టీఆర్ చెప్పారట. ఈ పథకాల గురించి విని చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని ఈ పథకాలను ప్రకటిస్తే టీడీపీ గెలవడం ఖాయమని తెలుస్తోంది. ఇక తెలుగు తమ్ముడు కూడా దీన్ని విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -