Orange: ఆరెంజ్ మూవీ కలెక్షన్లు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Orange: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు అనగా మార్చి 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో నేడు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా అభిమానులు చెర్రీ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మగధీర సినిమా విడుదల చేస్తామని ఆ తర్వాత మగధీరను పక్కకు నెట్టేసి ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్లాన్ చేయడం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2010లో విడుదలైనప్పుడు అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి మనందరికి తెలిసిందే. అటువంటి ఆరెంజ్ లవ్ స్టోరీ సినిమాని ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ మూవీ తర్వాత ప్లాన్ చేయడమేంటి అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

కానీ అభిమానులు మాత్రం తప్పకుండా సినిమాను చూస్తాము అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని చూడటం కోసం నిన్నటి నుంచే అభిమానులు థియేటర్లకు భారీగా ఎగబడ్డారు. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ బోర్డులు పడ్డాయి. ఒక్క హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోనే దేవి, సంధ్య, సుదర్శన్ లాంటి సింగల్ స్క్రీన్లన్నీ కలిపి 17 లక్షలకు పైగా వసూలు కావడం ఆశ్చర్యపరిచింది. డిమాండ్ ని తట్టుకోలేక మళ్ళీ ఆసియన్ తారకరామాను జోడించారు. అది కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ దిశగా వెళ్తోంది. మాస్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండే సీడెడ్ కర్నూలు కడప లాంటి ప్రాంతాల్లో సైతం అదే రెస్పాన్స్ కనిపిస్తోంది.

 

ట్విట్టర్ మొత్తం థియేటర్లో పాటలు వచ్చినప్పుడు ఆడియన్స్ ఊగిపోతూ డాన్సులు చేస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ఆరంజ్ కు వచ్చిన నష్టాల వల్ల తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లానని తమ్ముడు పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి అండగా ఉండకపోతే చనిపోయేవాడినని చెప్పిన నాగబాబుకి ఇప్పుడదే మెగా ఫ్లాప్ కల్ప తరువుగా నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -