Pawan Kalyan: రెండు సీట్లకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తావ్ సేనాని.. సైలెంట్ గా ఉంటే ఎలా అంటూ?

Pawan Kalyan: జనసేన అధినేత కూటమి ఏర్పాటు చేయడంలో చూపించిన దూకుడు ప్రచారంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ చూపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు లభించాయి. అయితే, ఈ పొత్తు కుదర్చడానికి పవన్ చాలా బలంగా ప్రయత్నించారు. ఏమైనా చేయాలని కానీ.. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడాలని అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకూడదని అనుకున్నారు. అందుకే, భిన్న దృవాలుగా ఉన్న టీడీపీ, బీజేపీని ఆయన కలిపారు. దానికి కోసం చాలా కష్టపడ్డారు. కూటమిని సక్సెస్ ఫుల్‌గా ఏర్పాటు చేశారు కానీ.. తర్వాత ఆయన దూకుడు తగ్గిందనే అభిప్రాయం సర్వాత్రా వినిపిస్తుంది. జగన్ ఓ వైపు.. చంద్రబాబు, నారా లోకేష్ మరోవైపు ప్రచారంలో దూసుకుపోతుంటే.. పవన్ నిన్న వారాహి యాత్రను స్టార్ట్ చేశారు. జగన్ సిద్దం పేరుతో నాలుగు సభలు నిర్వహించారు. మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. నారాలోకేష్ శంఖారావం నిర్వహిస్తున్నారు. ఇక, చంద్రబాబు కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తర్వాత.. ఇప్పుడు ప్రజాగళం పేరుతో మళ్లీ ప్రచారం మొదలు పెట్టారు.

ఓ వైపు మిగిలిన పార్టీలు తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకుంటే.. పవన్ మాత్రం మీనమేషాలు లెక్కబెట్టి.. వారాహి యాత్రను మొదలు పెట్టారు. మొత్తానికి యాత్రను అయితే మొదలు పెట్టారు కానీ.. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు పది రోజుల క్రితం ప్రకటించారు. కానీ, మచిలీపట్నం నుంచి ఎవరు అనే దానిపై తర్జనభర్జన పడి బాలశౌరి పేరును ప్రకటించారు. బాలశౌరి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలో చేరారు. మొదటి నుంచి ఆయనకే టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగినా.. మధ్యలో నాగబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేర్లు వినిపించాయి. కానీ, మొత్తానికి బాలశౌరి పేరును ప్రకటించారు. చివరికి మచిలీపట్నం ఎంపీ స్థానానికి తెరపడినా.. ఇంకా రెండు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇంకా.. పాలకుండ, అవనిగడ్డ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం ఎంపీ స్థానాలు ఒకదానికితో ఒకటి లింక్ ఉన్నాయి. ఎంపీ బాలశౌరిని మచిలీపట్నం నుంచి దింపాలా? లేదంటే అవనిగడ్డ నుంచి దింపాలా అనే అంశంలో పవన్ తర్జనభర్జన పడ్డారు. ఆయన్ని మచిలీపట్నం బరిలో నిలబెడితే.. అవనిగడ్డ నుంచి పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. అయితే, మచిలీపట్నంపై ప్రకటన వచ్చింది కానీ.. ఇంకా అవనిగడ్డపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి అవనిగడ్డకు అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

ఇక దీనితో పాటు పాలకుండకు కూడా అభ్యర్థిని ప్రకటించాలి. ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. అక్కడ తూర్పు కాపులు కూడా ఎక్కువగానే ఉంటారు. గత మూడు దఫాలుగా అక్కడ వైసీపీ గెలుస్తోంది. దీంతో.. వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీంతో.. అక్కడ త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే.. వారికి టీడీపీ సపోర్టు పూర్తిగా లభిస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ.. పవన్ ఇంకా అభ్యర్థిని ప్రకటించడం లేదు. వైసీపీ, టీడీపీ పార్టీలు మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీలే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశాయి. అలాంటిది.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలల్లో 23 అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. వాటిని కూడా ప్రకటించడానిక ఎందుకు అంత కష్టపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అయితే.. వారు ఎప్పుడు ప్రచారం చేస్తారు? ప్రజల్లోకి వెళ్తారనే అంశంపై జనసేనలో ఆందోళన నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -