Nagababu: అనకాపల్లి నుంచి పోటీ.. టీడీపీ మద్దతుతో నాగబాబు ఎంపీగా విజయం సాధించడం ఖాయమా?

Nagababu: మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనుకున్నది సాధించారు. అనకాపల్లి నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖరారు అయింది. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. కాకినాడ, మచిలీపట్నం,అనకాపల్లి. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బాలశౌరి వైసీపీ నుంచి జనసేన గూటికి చేరారు. ఆయనకు అక్కడ విజయావకాశాలు ఉన్నాయి. ఇక, కాకినాడ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ కూడా కాకినాడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. కాకినాడ సీటు బీజేపీకి కేటాయిస్తే.. జనసేన మరో స్థానాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇక మూడో స్థానం అనకాపల్లి. అనకాపల్లిని చంద్రబాబు జనసేనకే కేటాయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అక్కడ నుంచి నాగబాబు రంగంలో దిగుతారని తెలుస్తోంది.

అనకాపల్లిలో పోటీ చేయడానికి టీడీపీలో చాలా మంది క్యూ కడుతున్నారు. కానీ, టీడీపీ అనకాపల్లిని వదులుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొడుకు చింత కాయల విజయ్ అనకాపల్లి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. బౌరి దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తి కూడా పోటీకి సిద్దంగా ఉన్నారు. ఆ రకంగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఒకానొక దశలో చంద్రబాబు బౌరి దిలీప్ నే ఫైనల్ చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆయన మనసు మార్చుకొని అనకాపల్లి జనసేనకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. బౌరి దిలీప్ చక్రవర్తి, చింతకాయల విజయ్ లో ఎవరో ఒకరికి ఇస్తే.. రెండో వాళ్లు సపోర్ట్ చేస్తారా? లేదా అన్నా అనుమానం తలెత్తింది.

దీంతో.. చంద్రబాబు.. ఇద్దరికి ఇవ్వకుండా జనసేనకు కేటాయించారని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి జనసేనను గెలిపిస్తే.. నామినేటడ్ పదవుల రూపంలో న్యాయం చేస్తామని మాటిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. అనకాపల్లి సీటు జనసేన ఖాతాలో పడింది. అయితే, జనసేనలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. జనసేనలో చేరిపుడు ఆ వాగ్థానం తీసుకున్న తర్వాతే చేరిక జరిగిందని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. సడెన్‌గా జనసేన తొలిజాబితాలో ఆయన పేరు కనిపించింది. ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని అధినేత పవన్ ప్రకటించారు.

అయితే, దీని వెనక పెద్ద డ్రామా జరిగిందని తెలుస్తోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో.. పవన్ .. కొణతాలను ఒప్పించారని తెలుస్తోంది. ఇటీవల పవన్.. కొణాతాల ఇంటికి వెళ్లారు. ఆ విషయంపై మాట్లాడటానికే వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా అధినేత తమ ఇంటి వచ్చి అడగటంతో కొణతాల కూడా కాదనలేకపోయారట. ఇక.. ఎలాగైన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్న నాగబాబు.. కొన్ని నెలల నుంచి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారని తెలుస్తోంది. అందుకే, విశాఖకు తన మకాం కూడా మార్చేశారు. వరుసగా లోకల్ లీడర్స్ ను కలుస్తున్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ తరుఫున అనకాపల్లి ఎంపీగా అల్లు అరవింద్ ఓడిపోయారు. కానీ, అనకాపల్లిలో ఈ సారి నాగబాబు గెలుపు ఖాయంగా తెలుస్తోంది. సామాజికవర్గం పరంగా చూసినా.. పైగా పొత్తులో ఉన్న టీడీపీ కూడా బలంగా ఉండటంతో నాగబాబు ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్తారని జనసేన వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -