Prasadam: భగవంతుని ప్రసాదం దానం చేయడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prasadam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఇంట్లో పూజలు చేసిన లేదా ఆలయానికి వెళ్లిన స్వామి వారికి నైవేద్యంగా ప్రసాదం తీసుకువెళ్లడం మనం చేస్తుంటాము ఎలా స్వామివారికి నైవేద్యం సమర్పించి దానిని ప్రసాదంగా ఇతరులకు పంచుతూ ఉంటాము.ఇలా స్వామివారికి ప్రసాదం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలామందికి తెలియక పోయినప్పటికీ ఇదొక ఆచార సంప్రదాయంగా భావించి ప్రసాదాలు పంచుతూ ఉంటారు.

ఈ విధంగా స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కొంతమంది ప్రసాదం పెడుతూ ఉంటారు. లేకపోతే మన ఇంట్లో ఏదైనా పండుగల సమయంలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యం చేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి ప్రసాదం పెడుతూ ఉంటాము ఇలా ప్రసాదం పెట్టడం వల్ల ప్రసాదం తిన్నవారికి భగవంతుడిపై నమ్మకం ఏర్పడటమే కాకుండా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

 

సాధారణంగా ప్రసాదం చాలా తక్కువ పరిమాణంలోనే తింటాము కానీ ఆ తక్కువ పరిమాణంలో తీసుకునే ప్రసాదమే మనకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించి మన ఆలోచనలను కూడా ఉత్తేజ పరుస్తుంది. ఇలా ప్రసాదం తీసుకోవడం వల్ల భగవంతుడితో మనకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. అలాగే మన మనసులో భగవంతుడిపై నమ్మకం విశ్వాసం కూడా కలుగుతుంది.

 

ఈ విధంగా భగవంతుడికి మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటాము ఎక్కువగా బెల్లంతో తయారు చేసిన అన్నం, అలాగే పులిహోర, చక్కెర పొంగలి,అలసంద పప్పు వంటి వాటిని పెద్ద ఎత్తున ప్రసాదంగా పెడుతూ ఉంటారు. భగవద్గీత ప్రకారం భగవంతుడికి సమర్పించిన ప్రసాదం మనం ఇతరులకు దానం చేయటం వల్ల మనకు స్వర్గలోకంలో నివాసం లభిస్తుందని చెబుతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -