Upasana Delivery: ఉపాసన డెలివరీ ఖర్చు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Upasana Delivery: మెగా పవర్ స్టార్ రాం చరణ్ – ఉపాసన దంపతులు ఇటీవల తల్లితండ్రులు అయ్యారు. ఉపాసన జూన్ 20 తెల్లవారు జామున 1:30 నిమిషాల ప్రాంతంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్ – ఉపాసన వివాహాం జరిగిన పది సంవత్సరాలకు వారు తల్లితండ్రులు అయ్యారు. దీంతో ఎప్పటినుండి ఇతరుల కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబ సభ్యులు మంగళవారం రోజున తమ ఇంటికి మహాలక్ష్మి అడుగుపెట్టడంతో ఆనందంలో మునిగిపోతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టిన సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉపాసన డెలివరీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన డెలివరీ కోసం రాంచరణ్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉపాసన జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ఉపాసన అపోలో వైద్య సంస్థలకు వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ తన డెలివరీ కోసం రాంచరణ్ అధిక మొత్తంలో ఫీజు చెల్లించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ ఆమె డెలివరీ కోసం విదేశాల నుండి కొంతమంది డాక్టర్లను రప్పించారని, అంతే కాకుండా ఉపాసన డెలివరీ కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న వైద్య పరికరాలు కూడా విదేశాల నుండి తెప్పించినట్లు తెలుస్తోంది.

 

ఇలా విదేశాల నుండి తెప్పించిన వైద్య పరికరాలకు మరియు డాక్టర్లకు కలిపి మొత్తం కోటిన్నర వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. తమ కూతురు డెలివరీ కోసం అయిన ఖర్చు తామే భరిస్తామని ఉపాసన తల్లి దండ్రులు చెప్పినప్పటికీ రామ్ చరణ్ మాత్రం తన భార్య డెలివరీ ఖర్చు బాధ్యత తనదేనని కోటిన్నర రూపాయలు బిల్లు చెల్లించినట్లు ప్రస్తుతం నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -