Priyanka Chopra: ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్లు.. అలా అవమానించారా?

Priyanka Chopra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే తప్పకుండా ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది.ఇలా గ్లామర్ షో చేసినప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని ముందుకు సాగి పోవడానికి ఇదొక మార్గం అంటూ ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే చాలామంది దర్శక నిర్మాతలు చెప్పిన విధంగా చేయడం ఇష్టం లేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక చోప్రా ఒకరు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కెరీర్ మొదట్లో ఈమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఈ సందర్భంగా బయటపెట్టారు.కెరియర్ మొదట్లో ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు సరిగా అవగాహన లేకపోవడంతో దర్శక నిర్మాతలు చెప్పినట్టే తాము చేసామని అయితే కొన్నిసార్లు తనకు ఇష్టం లేకపోయినా దర్శకుడు ఒత్తిడి చేయడంతోనే కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించానని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించారు.

 

2002-03 స‌మ‌యంలో ఒక సినిమా షూటింగులో భాగంగా ఇది జ‌రిగింద‌ని ప్రియాంక వివ‌రించింది. ఆ సీన్ ఒక స్ట్రీమీ సీన్ అని అందులో త‌ను రొమాంటిక్ గా న‌టించాల‌ని.. ఆ సీన్ లో త‌న న‌ట‌న కొన‌సాగుతుండ‌గా.. ఆసీన్ లో నా అండర్ వేర్ కెమెరాకు కనిపించే విధంగా హీరో పై పడి నటించాలనీ డైరెక్టర్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ఈమె తెలియజేశారు. తాను మామూలుగా నటించడానికి వీలులేదని నాకు అండ‌ర్ వేర్ కనిపించాల్సిందే, ఎవ‌రు ఈ సినిమా చూడ‌టానికి వ‌స్తారు ఆమె అలా క‌నిపించ‌క‌పోతే.. అంటూ ఆ ద‌ర్శ‌కుడు వ్యాఖ్యానించాడ‌ని కూడా ప్రియాంక వివ‌రించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -