Actress: నటి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లతో అలాంటి పనులు చేశానంటూ?

Actress: హాలీవుడ్ క్యూట్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ అయినా నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె నిక్ జోనస్ ని ప్రేమించక ముందే బాలీవుడ్ లో ఎంతోమంది హీరోలతో ప్రేమ ప్రేమాయణం కొనసాగించింది. నిక్ జోనస్ కూడా ప్రియాంకతో ప్రేమలో పడకముందు ఎంతోమందితో ఎఫైర్ ను కొనసాగించాడు.

తాజాగా ఈ విషయాల గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. అలెక్స్‌ కూపర్‌ కాల్‌ హర్‌ డాడీ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ.. నేను నిక్‌ జోనస్‌ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్‌ అవగానే మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి, మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్‌ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఈ క్రమంలో నాతో పని చేసినవారితో డేటింగ్‌ చేసేదాన్ని. కొందరితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయి. కానీ నేను డేటింగ్‌ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్‌ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాను.

ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్‌ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్‌ తీసుకున్నాడు. అతడు కూడా నా కంటే ముందు చాలామందిని ప్రేమించాడు. కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యం అని అనుకున్నాను. అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. కాగా నిక్‌ జోనస్‌ గతంలో మిలీ సైరస్‌, సెలీనా గోమెజ్‌, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్‌, కెండల్‌ జెన్నర్‌, కేట్‌ హడ్సన్‌ ఇలా చాలామందితో ప్రేమాయణం కొనసాగించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -