Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన చొక్కా ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం తన గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ సి 20 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

 


ఇక బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు సైతం ఈ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో మహేష్ బాబు తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

 

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు నలుపు రంగు గళ్ళ చొక్కా ధరించిన సంగతి మనకు తెలిసిందే. ఈ షర్టులో మహేష్ బాబు చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఈ క్రమంలోని ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు ధరించిన ఈ షర్టుపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

 

మహేష్ బాబు ధరించిన ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందినదని దీని ఖరీదు అక్షరాల 17,999రూపాయలు అని తెలియడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ షర్ట్ ఖరీదు ఏకంగా అన్ని వేల రూపాయల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా సెలబ్రిటీలు ఇలా ఖరీదైన వస్తువులను బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

 

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -