Naresh-Pavitra Lokesh: నరేష్ లో పవిత్రకు నచ్చిన క్వాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Naresh-Pavitra Lokesh: నరేష్, పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన జంట. ఎవరి నోట విన్నా వీళ్లే హాట్ టాపిక్. వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకీ విషయం ఏమంటే నరేష్ నిర్మించిన మళ్లీ పెళ్లి సినిమా మే 26వ తారీఖున రిలీజ్ కి సిద్ధమవుతుంది. అందుకుగాను ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నరేష్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవిత్ర.. నరేష్ ఎంత సీరియస్ మేటర్ అయినా లైట్ గా తీసుకుంటారు అయితే దాన్ని పరిష్కరించేందుకు సీరియస్ గా ప్రయత్నం చేస్తారు. అలాంటి క్వాలిటీ నాకు లేదు నేను చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాను అని తెలిపింది.

 

నరేష్ ఈరోజు గురించే ఆలోచిస్తారు ఇప్పుడు తనకి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు రేపు అనేది ఉంటే రానివ్వు అప్పుడు చూసుకుందాం అంటారు. నరేష్ లో ఉండే ఈ క్వాలిటీ నాకు చాలా నచ్చుతుంది. అన్నింటికీ మించి నరేష్ నన్ను చాలా బాగా చూసుకుంటారు అందుకు నేను ఆనంద పడుతున్నాను అని చెప్పుకొచ్చారు పవిత్ర లోకేష్.

 

ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఇది బోల్డ్ మూవీ ఎవరిపై రివెంజ్ తో తీసిన చిత్రం కాదు. ఇది నరేష్ జీవిత చరిత్ర అంటున్నారు. అవునో కాదో మీరే చూసి చెప్పాలి. ఈ సినిమాలో ఎమోషన్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉందని చెప్పుకొచ్చారు పవిత్ర. నరేష్ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ విజయనిర్మల గారిని కలిసాను కానీ ఎక్కువ అనుబంధం లేదు.

 

కృష్ణ గారితో మాత్రం ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది ఆయన రోజు నాతో మాట్లాడే వారిని చెప్పుకొచ్చారు పవిత్ర. ఇక మే 26న వరల్డ్ వైడ్ గా తెలుగు కన్నడ భాషల్లో విడుదలవుతున్న మళ్లీ పెళ్లి సినిమాని సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -