Prabhas: ప్రభాస్ మూవీ హక్కుల రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సలార్’. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంతనీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై సినీ ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల సలార్ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న మలయాళ హీరో పృథ్వీరాజ్ భార్య సుప్రియా మేనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సలార్ సెట్స్ ను సందర్శించిన సుప్రియా మేనన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పింది.

 

 

సలార్ మూవీ రికార్డులు బ్రేక్ చేసేలా కనిపిస్తోందని సుప్రియా మేనన్ తెలిపారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని పేర్కొంది. సినిమా కోసం ప్రశాంత్ నీల్, చిత్రబృందం ఎంతో శ్రమిస్తోందన్నారు. దీంతో ఈమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమాపై సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు కూడా మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుదని పేర్కొన్నారు.

 

 

కాగా, ప్రభాస్‌కు ప్రస్తుతం సాలిడ్ కావాల్సి ఉంది. సాహో, రాధే శ్యామ్ సినిమాలు నిరాశపరిచాయి. ఆదిపురుష్ టీజర్ చూసి అభిమానులు ఎంతో నిరాశ చెందారు. వందల కోట్ల బడ్జెట్‌తో మీరు తీసిన సినిమా ఇదేనా అంటూ దర్శకుడు ఓమ్ రౌత్‌పై విరుచుకుపడ్డారు. వీఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉందని, వీలైనంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రస్తుతం అందరి కళ్లు సలార్‌పైనే ఉంది. కేజీఎఫ్ తరహాలోనే ప్రభాస్‌కి రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇవ్వనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో వార్త వైరల్ అవుతుంది. సలార్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్‌, ప్రభాస్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -