RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఈ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మన దేశాన్ని గర్వించే విధంగా చేసిందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో తాజాగా అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఈ అవార్డును చంద్రబోస్, కీరవాణి అందుకున్నారు.

ఇక ఈ సినీ బృందం మొత్తం ఈ మూమెంట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి చాలా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎవరు ఈ విషయం గురించి స్పందించలేదు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎన్టీఆర్ ఒక విషయాన్ని పంచుకున్నాడు. తాజాగా ఈ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఈ సినీ బృందం అంతా అక్కడ సందడి చేశారు.

 

ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ బాగా ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. అక్కడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి.. తనకు ప్రస్తుతం అసలు పదాలే దొరకటం లేదు అంటూ.. ఈ సిని బృందానికే కాదు భారతదేశ్యానికి కూడా గర్వకారణంగా ఉంది అని అన్నాడు.

 

ఇక అంతకుముందే ఎన్టీఆర్ మరో మ్యాగజైన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే అందులో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇక తదుపరి సినిమా గురించి అడగటంతో.. మార్చి 29వ తేదీ నుంచి ఎన్టీఆర్ 30 షూటింగ్లో పాల్గొనబోతున్నాను అని తెలిపాడు. ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు అని తెలిపాడు.

 

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అని రిపోర్టర్ అడగటంతో.. అది మొదలయ్యే వరకు నేను ఆగలేక పోతున్నాను అంటూ.. రాజమౌళి కూడా ఈ విషయం ఎప్పుడూ అనేది తనకు ఇంకా చెప్పలేదు అని అన్నాడు. అంటే దీనిని బట్టి చూస్తే ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది అని అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -