Bihar: ఈ ఆకతాయి ముద్దు పెట్టి చేసిన పని తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Bihar: ప్రస్తుత కాలంలో యువత చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో వారి భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా నేరాలకు పాల్పడుతూ వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు . ముఖ్యంగా ప్రస్తుత కాలంలో యువకులు మహిళలతో ప్రవర్తించే తీరు మరి దారుణంగా ఉంటుంది. రోడ్డుమీద వెళ్తున్న మహిళల పట్ల యువకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను వేధింపులకు గురి చేయడమే కాకుండా మరికొంతమంది వారి మీద లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయటానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ యువకులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇటీవల బీహార్ లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్త పట్ల ఒక యువకుడు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మార్చి పదవ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

బీహార్ లోని జముయ్ జిల్లాలోని జమయ్ సదర్‌ ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి బలవంతంగా ముద్దు పెట్టి అక్కడి నుండి పారిపోయాడు.ఈ ఘటనతో మహిళ ఒక్కసారిగా ఆ మహిళ ఖంగుతింది. ఆ తర్వాత ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇకపై ఎటువంటి సంఘటనలు జరగకుండా నిందితుడికి తగిన శిక్ష విధించాలని బాధ్యత మహిళా పోలీసులను కోరింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -