Nara Brahmani: నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Nara Brahmani: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. అలాగే తన తదుపరి సినిమాను బాబి తో చేయబోతున్నాడు. ఇకపోతే బాలయ్య బాబు కూతురు నారా బ్రాహ్మణి విషయానికి వస్తే..

బాలయ్య బాబు పెద్ద కూతురు అయిన నారా బ్రాహ్మణి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని అందం ఈమె సొంతం. తనకంటే పెద్దవారిని గౌరవించే హుందాతనం, చదువులో గోల్డ్ మెడలిస్ట్ ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్న బాలయ్య పెద్ద కూతురు నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కోడలిగా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. బ్రహ్మీణి నారా లోకేష్ భార్య అన్న విషయం మనందరికీ తెలిసిందే. బ్రాహ్మణి పెళ్లికి ముందు హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వచ్చినా సరే సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో వాటిని రిజెక్ట్ చేసింది.

 

దాంతో చదువు, కెరీర్, లైఫ్ సెటిల్ అన్ని విషయంలోనూ కూతుర్లకే వదిలేసాడు బాలయ్య. అందుకే ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండే బ్రాహ్మణి సినిమాలను కూడా ఎంతో తక్కువగా చూస్తూ ఉంటుందట. మరీ ముఖ్యంగా తన తండ్రి బాలకృష్ణ సినిమాలను మాత్రం ఎక్కువగా చూస్తుందని లవ్ రొమాంటిక్ సినిమాలు బ్రాహ్మణికి పెద్దగా ఇష్టం ఉండదని తెలుస్తోంది.
అయితే సినిమాలు చాలా తక్కువగా చూసే బ్రాహ్మిణికి ఇష్టమైన హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బ్రాహ్మణికీ తన తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నటన అంటే ఎంతో ఇష్టమట. అంతే కాకుండా ఇప్పటికీ ఆయన సినిమాల టీవీలు వస్తే మాత్రం క్రమం తప్పకుండా ఆ సినిమాలు చూస్తుందట. మరీ ముఖ్యంగా వారి తాతగారు నటించిన దానవీరశూరకర్ణ సినిమా అంటే బ్రాహ్మణికి ఎంతో ఇష్టమట. ఆ తర్వాత అంతగా బాగా నచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. తాత‌ ఎన్టీఆర్ తర్వాత తండ్రి బాలకృష్ణ నటన ఎక్కువగా ఇష్టపడుతుందట బ్రాహ్మణి. ఆ తర్వాత తన అన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా లైక్ చేస్తుందట. దీంతో ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -