Director: పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Director: పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ని ఎవరో గుర్తుపట్టారా.. అతనికి ఉన్న ట్రాక్ రికార్డు ఏమిటో తెలుసా.. అతను చేసిన ప్రతి సినిమా స్టార్ హీరో తోనే చేశాడు కానీ ఒక్కరికి కూడా హిట్ ఇవ్వలేని దర్శకుడు. అతనే మెహర్ రమేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న మెహర్ రమేష్ ఫోటో ఎప్పటిదో.. అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎప్పుడు, ఎవరు పెట్టారు అనేది కూడా తెలియడం లేదు.ఇక మెహర్ రమేష్ కెరియర్ విషయానికి వస్తే ఇతను ఒక నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రవాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగ గా కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ తో రీమేక్ చేసి దర్శకుడిగా అక్కడ సూపర్ హిట్ కొట్టారు. 2008లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి సినిమాతో తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా అడుగుపెట్టారు. అయితే తెలుగులో మొదటి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్ మూటగట్టుకున్నారు మెహర్ రమేష్.

 

ఆ తరువాత వచ్చిన బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలకి సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఆ తరువాత దర్శకుడుగా అతను తీసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో, దగ్గర్నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన బోళాశంకర్ సినిమా వరకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం అతని ట్రాక్ రికార్డ్. ఇదే విషయం గా మెహర్ రమేష్ మీద అనేక ట్రోల్స్ వస్తున్నాయి.

 

అపజయాలని మూట కట్టుకొని.. పది సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ వినియోగించుకోలేకపోయాడం టూ అతనిపై సెటైర్లు వేస్తున్నారు ప్రేక్షకులు. పాపం ఈ సినిమా మీద అటు చిరంజీవితో పాటు ఇటు మెహర్ రమేష్ సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరికీ ఈ సినిమా చాలా అవసరం. అయినప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయి మెహర్ రమేష్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా అయిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -