Vastu: ఈ దిక్కులో చెప్పులు పెడితే మీ జీవితం నాశనమే.. ఏమైందంటే?

Vastu: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న పని చేసిన వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉంటారు. అయితే మన ఇంట్లో చెప్పులు వదిలే ప్రదేశంలో కూడా కొన్ని వాస్తు పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

చాలామంది బయట పనులను ముగించుకొని అలసిపోయి ఇంటికి వస్తారు లేదా హడావుడిగా ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నంలో చెప్పులను ఎక్కడపడితే అక్కడ వదిలేసి వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. చెప్పులు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉత్తర మరియు తూర్పు దిశలో అసలు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.

 

ఇలా చెప్పులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.అందుకే పొరపాటున కూడా చెప్పులను ఎప్పుడు ఈ దిశలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఉత్తర దిశ లక్ష్మీదేవికి అనుకూలమైన దిశ ఈ దిశలో లక్ష్మీదేవిని లేదా సంపదకు మూలకారకుడు అయినటువంటి కుబేరుడిని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాంటి ఈ దిశలో చెప్పులను వదలటం అంటే లక్ష్మీదేవి కోపానికి గురి కావడమే అని అర్థం.

 

ఇలా ఉత్తర దిశలో చెప్పులు లేదా బూట్లు వదలడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడమే కాకుండా కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా క్షీణిస్తుందని తరచు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు ఎల్లప్పుడూ కూడా ఇంట్లో పడమర దిశ లేదా దక్షిణ దిశలో ఉండడం ఎంతో మంచిది. ఇలా చెప్పులు కూడా సరైన దిశలో ఉండటం వల్ల వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల పరిస్థితులు తలెత్తుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -