Venkateshwara Swamy: శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే చాలట.. ఏం జరిగిందంటే?

Venkateshwara Swamy: శనివారం రోజు చాలామంది వెంకటేశ్వరస్వామి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక దేవుడిని ఏ విధంగా అయితే హిందువులు పూజిస్తూ ఉంటారో,శనివారం రోజు కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే శనివారం వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ప్రతి భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శనం చేసుకోవాలని భావిస్తారు.

శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వక్షస్థలంపై నిలిపిన రోజు శనివారమే.

వెంకటేశ్వర స్వామి వారిని పూజించే వారిని శని పీడించనని వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేశాడు. అది కూడా శనివారం రోజే. శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం. వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి శనివారం నాడే ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు.

 

వెంకటేశ్వర స్వామి వారు ఆలయ ప్రవేశాన్ని శనివారం నాడు చేశారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. అందుకే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి. అందుకే శనివారం రోజు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో తులసి మాల సమర్పించి నైవేద్యాలు సమర్పించి పూజించడం వల్ల స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -