Kantara: ‘కాంతార’ సినిమాలో ఆ తెగ వారు నిజంగా ఆత్మలతో మాట్లాడుతారా?

Kantara: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం ‘కాంతార’. ఈ సినిమా విడుదలై ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మౌత్ టాక్ వల్ల ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. నిజానికి ఇది మనందరికీ ఒక సినిమానే కావొచ్చు. కానీ ఈ సినిమా కర్ణాటకలో నివసించే ఓ తెగ జీవన విధానానికి సంబంధించిన అంశాలను కలిగి ఉంది. వారి కళలు, నమ్మకాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ‘కాంతార’ ఒక నిలువుటద్దంలా నిలిచిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కాంతార సినిమాపై అనేక పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ నిజంగా జరిగినదా? మంగళూరు ప్రాంతంలో నివసించే ‘తుళు’ భాష తెగ ప్రజలకు నిజంగానే ఆత్మలు కనిపిస్తాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాంతార సినిమాలో మనం చూసిన నృత్యానికి, దేవుడికి ఉన్న సంబంధం ఏంటీ? మనిషిలో దేవుడు వస్తాడా? మూడు దశాబ్దాల క్రితం దర్శకుడు రిషబ్ శెట్టి సొంతూరిలో జరిగిన సంఘటన ఏంటీ? ఇలా అన్ని కోణాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి మనం ఈ రోజు సమాధానం తెలుసుకుందాం. అయితే కాంతార స్టోరీ కంటే ముందు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా పల్లెటూర్లలో అమ్మవారి ఊరేగింపు జరిగినప్పుడు కొందరు స్త్రీలకు అమ్మవారి పూనినట్లు చెబుతుంటారు. అప్పుడు ఆ స్త్రీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఎంత మంది ఆమె దగ్గరికి వెళ్లినా అందరినీ నెట్టి పడేసేంత బలం వస్తుంది. ఆ సమయంలో ఆమె తింటున్నారో? ఏం తాగుతున్నారో? వారికే అర్థం కాదు.

అయితే పూనకం వచ్చిన సమయంలో ఆ స్త్రీ అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. చాలా మంది ఈ విషయాలు సీరియస్‌గా తీసుకోరు. వీటి వల్లే చాలా గ్రామాల్లో అన్యాయాలను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొందరు భవిష్యవాణి కూడా చెబుతుంటారు. ఇలాంటి ఓ సంస్కృతి, సంప్రదాయాలను రిషబ్ శెట్టి సినిమాగా మలుచుకున్నాడు. కాంతార మూవీ కథ ‘బంట్’ తెగకు చెందిన వారి పూర్వీకుల చరిత్ర. బంట్ అంటే పోరాటం అని అర్థం. వీరి భాష తుళు. కాలక్రమేణా వీరు మూడు జాతులుగా విడిపోయారు. కానీ వీరు ఇప్పటికీ నమ్మేది ‘కంబళ’. కంబళ అంటే కాంతార సినిమాలో చేసే నృత్యం పేరు. నిజానికి ఈ సినిమా స్టోరీ నిజమైనదే. కంబళ నృత్యం చేసే వారికి వారి పూర్వీకులు ఆవహిస్తారని, ఆ సమయంలో వీరు ఆత్మలతో కూడా మాట్లాడుతారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -