Venga Baba: మూడు నెలల్లో భారత్‌ కరువుకాటకల్లోకి..నిజమా?

Venga Baba: ప్రపంచ వ్యాప్తంగా వేంగా బాబా జ్యోతిష్యం తెలియని వారుండరు. ఆయన చెప్పిన జ్యోస్యాల్లో చాలా వరకు నిజమయ్యాయి. వేంగా బాబా జ్యోతిష్యంతో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు పడుతున్నాయి. రానున్న మూడు నెలల్లో భారత్‌ కరువు కాటకాలతో సతమతమవుతోందని వేంగా బాబా జోస్యాం చెప్పారు. 2022లో భారత్‌లో కరువు తప్పదని హెచ్చరించారు. అయితే బాబా చెప్పినట్టుగా జరిగితే ఈ పాటికే జరిగి ఉండేది. కానీ బాబా నోటి వాక్కుపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకం. బాబా చెప్పింది చాలావరకూ జరిగింది. అంటే బాబా చెప్పినట్టు జరిగితే మాత్రం.. ఇండియాకు ఈ మూడు నెలల పాటు సంక్లిష్ట సమయమన్న మాట. దీనిపై దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్న వారు కష్టాలు తప్పవని డిసైడ్‌ అవుతున్నారు.

బల్గేరియాకు చెందిన వేంగా బాబా జ్యోతిష్యం చెప్పడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనలను ముందుగానే బాబా తన జ్యోతిష్యం ద్వారా వెల్లడించారు. ప్రపంచానికి ఎదురైన రెండు అపాయాలను బాబా ముందుగానే చెప్పారు. భవిష్య వాణిని ముందుగానే వెల్లడించారు. అయితే ఆయన చెప్పిన ఆరింటిలో రెండు మాత్రమే నిజమయ్యాయి. ఆస్ట్రేలియాకు వరదలు తప్పవని హెచ్చరించారు. అలానే వరదలు చుట్టుముట్టాయి. పాకిస్తాన్‌ కు కూడా వరద ముప్పు ఉంటుందని చెప్పారు. అక్కడ కూడా అదే జరిగింది. కొన్ని దేశాల్లో నీటి కొరత ఎదురవుతుందని హెచ్చరించారు. 2022 తరువాత సైబిరియాలో ఓ కొత్తరక వేరియంట్‌ వైరస్‌ వస్తుందని కూడా హెచ్చరించారు. అంతే కాకుండా మిడతల దండు, ఏలియన్స్‌ దాడులు, వర్చువల్‌ రియాలిటీ అభివద్ధిలోనూ జోష్యం చెప్పారు.

ఇండియాకు హెచ్చరించినట్టుగా 2022లో విపత్తు తప్పదని హెచ్చరించారు. కానీ బాబా చెప్పిన కాలంలో ఎనిమిది నెలలు కరిగిపోయాయి. ఉన్నది అటు ఇటుగా 100 రోజులు మాత్రమే, కానీ బాబా అటు ప్రపంచ ఉష్ణోగ్రతలను అనుసంధానిస్తూ దాని పర్యవసానాలు ఇండియాపై పడతాయని చెప్పుకొచ్చారు. అంటే ఇండియాలో ఉష్ణోగ్రతలు తగ్గి పంట పొలాలపై మిడతలు దాడిచేస్తాయని, సర్వనాశనం చేస్తాయని.. తద్వారా కరువు పరిడవిల్లుతుందని జోష్యం చెప్పారు. దానికి తగ్గట్టుగానే దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వేంగా బాబా చెప్పిన ప్రమాద ఘంటికలు తప్పవా అంటూ భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -