IPL 2023: ఐపీఎల్ మినీ వేలం కోసం వేదిక ఖరారు! ఈసారి అక్కడ నిర్వహించబోతున్న బీసీసీఐ

IPL 2023: వచ్చే ఏడాది మార్చి చివరివారం నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్-2023 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పట్నుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ మేరకు వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదిరిగా కాకుండా మినీవేలం నిర్వహించనుంది. ఐపీఎల్-2023 వేలాన్ని ఇస్తాంబుల్ (టర్కీ రాజధాని), బెంగళూరులో గానీ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వేదిక మారినట్టు తెలుస్తున్నది.

 

2023 ఐపీఎల్ వేలాన్ని కొచ్చి (కేరళ) లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ముందుగా అనుకున్నదాని ప్రకారం డిసెంబర్ 16న వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా తాజా రిపోర్టుల ప్రకారం డిసెంబర్ 23న కొచ్చిలో ఐపీఎల్ వేలం జరిగే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

వేలం కంటే ముందు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు..? పంపించేది ఎవరు..? వంటి జాబితాను ఈనెల 15 లోపు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బీసీసీఐ వేలం ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఫ్రాంచైజీలు 15 మందిని రిటైన్ చేసుకుని 10 మందిని వేలంలో వదిలేయవచ్చు. ఆ మేరకు పది ఫ్రాంచైజీలు అదే పనిలో నిమగ్నమయ్యాయి.

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా పెంచనున్నారు. గతేడాది ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ రూ. 90 కోట్లు ఉండేది. ఇప్పుడు దానిని మరో రూ. 5 కోట్లు పెంచి మొత్తం.. రూ. 95 కోట్లుగా మార్చారు. దీంతో ఆయా జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్ల మీద మరింత ఖర్చు చేసే అవకాశం దక్కనుంది. కాగా, ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -