IPL-2023: కెప్టెన్‌గా సన్‌రైజర్స్ అతడికే అవకాశం ఇవ్వనుందా?

IPL-2023: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం అన్ని జట్లు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే నెలలో కొచ్చిలో జరిగే మినీ వేలంలో పాల్గొననున్నాయి. దీని కోసం ఇప్పటికే అన్ని జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లు చాలా మంది ఆటగాళ్లను వదులుకున్నాయి. దీంతో వచ్చే నెలలో నిర్వహించేది పేరుకే మినీ వేలం అయినా.. భారీగానే జరిగేలా కనిపిస్తోంది.

 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే అంతా అయోమయంగా వ్యవహారం నడుస్తోంది. డేవిడ్ వార్నర్‌ను కాదని 2019లో కెప్టెన్ చేసిన కేన్ విలియమ్సన్‌ను, అలాగే భారీ ధరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను కూడా రిటెన్షన్ ప్రక్రియలో ఆ జట్టు వదిలేసింది. మొత్తం 12 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

 

 

గతంలో జరిగిన మెగా వేలంలో కేన్ విలియమ్సన్‌ను రూ.14 కోట్లకు సన్‌రైజర్స్ టీమ్ రిటైన్ చేసుకోగా.. నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరినీ వదులుకోవడంతో ఈ టీమ్ వద్ద భారీ పర్స్ మిగిలింది. వీళ్లిద్దరి నుంచే సుమారు రూ.25 కోట్లను ఆదా చేసుకుంది. రిలీజ్ చేసిన మిగతా ఆటగాళ్ల ద్వారా మరో రూ.20 కోట్ల వరకు మిగుల్చుకుంది.

 

 

కావ్య పాప మనసులో ఏముంది?
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ డైరెక్టర్ కావ్యా మారన్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.ప్రస్తుతం ఈ టీమ్ వద్ద మొత్తం రూ.42.25 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతో మినీ వేలంలో విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని కావ్య పాప ఆలోచిస్తోంది. అయితే వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గా భువనేశ్వర్‌కు పగ్గాలు అప్పగించనున్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -