IPL Rules: 2023 ఐపీఎల్‌లో అమల్లోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. కాన్సెప్ట్‌ ఏంటంటే..!

IPL Rules: ఇండియాలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. గడచిన ఐపీఎల్‌ సీజన్‌లో 10 జట్లు పార్టిసిపేట్‌ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు 2022 సీజన్‌ ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. అంతకు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న హార్దిక్‌ పాండ్య.. గుజరాత్‌ టైటాన్స్‌ను లీడ్‌ చేశాడు. ఆరంభంలోనే అదరగొడుతూ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ కోసం డిసెంబర్‌ 23న మినీ వేలం నిర్వహించనున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. 2023 నుంచి ఇంపాక్ట్ ప్లేయర్‌ను పరిచయం చేయనున్నారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌లో.. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌లాగే ఐపీఎల్‌లో ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వ్యవహరిస్తాడని బీసీసీఐ వెల్లడించింది.

ఏమిటీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కాన్సెప్ట్‌?
ఇటీవల బీసీసీఐ ఓ అధికార ప్రకటన చేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేయాలని నిర్ణయించిన బీసీసీఐ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మార్చుకునే వీలు కల్పించేలా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కాన్సెప్ట్‌ను బీసీసీఐ తీసుకొచ్చింది. రూల్‌ ప్రకారం రెండు టీమ్స్‌ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్‌తో భర్తీ చేసుకొనే అవకాశం దక్కుతుంది.

అయితే, ఇది కచ్చితంగా పాటించాలని రూల్‌ లేదు. జట్టుకు ఉపయోగపడుతుందనుకుంటే మాత్రమే ఇలా చేసుకోవచ్చు. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే దీన్ని అమలు చేసింది బీసీసీఐ. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పరిచయం అయ్యాడు. అతన్ని తీసుకున్న తర్వాత ఢిల్లీ టీమ్ 71 రన్స్‌తో ఆ మ్యాచ్‌లో నెగ్గింది. 14వ ఓవర్ ముగిసేలోపే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -