IPL: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రంగం సిద్ధం.. ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ

IPL: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు వచ్చేనెల 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా మంగళవారంతో అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది.

అటు రాజస్థాన్ రాయల్స్ 9 మంది ఆటగాళ్లను, పంజాబ్ కింగ్స్ 9 మంది ఆటగాళ్లను, చెన్నై సూపర్ కింగ్స్ 8 మంది ఆటగాళ్లను, లక్నో సూపర్ జెయింట్స్ ఏడుగురు ఆటగాళ్లను, గుజరాత్ టైటాన్స్ ఆరుగురు ఆటగాళ్లను విడుదల చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు ఆటగాళ్లను, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదుగురు ఆటగాళ్లను వదిలేశాయి. సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ విలియమ్సన్‌ను వేలంలోకి విడిచిపెట్టి అందరినీ ఆశ్చర్యపరించింది. పంజాబ్ కింగ్స్ జట్టు కూడా గత సీజన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది.

ఆటగాళ్లను విడిచిపెట్టడంతో ఆయా ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ పెరిగింది. ఆటగాళ్లను వదిలిపెట్టిన తర్వాత అత్యధిక పర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉంది. ఆ జట్టు వద్ద రూ.42.25 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఆ జట్టు వద్ద రూ.32.2 కోట్ల పర్స్ ఉంది.

ఏ జట్టు దగ్గర ఎంత పర్స్ ఉంది?

సన్‌రైజర్స్ దగ్గర రూ.42.25 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ.32.2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.20.55 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.13.2 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.8.75 కోట్ల పర్స్ ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వద్ద అత్యల్పంగా రూ.7.05 కోట్ల పర్స్ మాత్రమే ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -