Congress: ప్రత్యేక హోదా అస్త్రంతో ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం ఖాయమా?

Congress: రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను సాధనంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు. 2019లో ప్రత్యేక హోదా హామీ తోనే ఆయన అధికారంలోకి వచ్చారని, ఈ ఐదేళ్లలో అది సాధించకపోగా కనీసం హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని నోరు తెరిచి అడగలేదని, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేది లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి.

 

ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె కార్యకర్తల దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే ప్రత్యేక హోదా అస్త్రాన్ని అన్న పై ప్రయోగించాలనుకుంది షర్మిల. ఢిల్లీ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై పోరాడాలని నిర్ణయించుకుంది.రెండో తేదీన దీక్షకు కూర్చోనున్నట్లు తెలిపింది. గురువారం నాటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు కార్యవర్గ సభ్యులు డీసీసీ అధ్యక్షులు అంతా హస్తినకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

 


ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వాగ్దానాలు గురించి, జగన్ ని నమ్మి అధికారం అప్పగిస్తే ఎంత నమ్మకద్రోహం చేశారో ప్రజలకు అర్థమయ్యేలాగా షర్మిల వివరిస్తారు. ఢిల్లీ యాత్ర పూర్తయ్యాక ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర, తరువాత గన్నవరం, తర్వాత విశాఖ పట్నం లలో బహిరంగ సభలు చేపట్టాలని షర్మిల ఆలోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రధాన హామీగా చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మిల లాంటి నాయకత్వం రావడంతో హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -