YS Sharmila: ఆయన ప్లాన్ వల్లే బాలయ్య షోకు షర్మిలను పిలిచారా?

YS Sharmila: హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నట సింహం బాలకృష్ణతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ కానున్నారు. షర్మిల-బాలకృష్ణ భేటీ కానుండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వార్త సంచలనంగా మారింది. అయితే వీరిద్దరూ కలుసుకునేది రాజకీయ వేదికపై కాదు. బుల్లితెర టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో చీఫ్ గెస్ట్ గా హాజరుకానుంది. బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 నడుస్తోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ షోలో 1995 ఆగస్టులో టీడీపీ సంక్షోభానికి సంబంధించిన వివరాలు, ఎన్టీఆర్‌పై పార్టీ తిరుగుబాటు, వ్యూహాత్మక రాజకీయ సంఘటనలపై చంద్రబాబు నాయుడు వివరంగా వెల్లడించారు. తాజాగా ఇదే షోకి గెస్ట్ గా ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్ షర్మిల రానుంది.

 

 

ఆసక్తికరంగా బాలయ్య-షర్మిల భేటీ..

బాలయ్య-షర్మిల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో సీఎం జగన్‌ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకీ షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై సీఎం జగన్ మండిపడ్డారని అప్పట్లో వార్తలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో సోదరుడు జగన్‌కు ఇష్టం లేకపోయినా షర్మిల వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే వివేకా హత్య కేసు తమ కుటుంబంలో అత్యంత విషాద ఘటనగా షర్మిల పేర్కొన్నారు. తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారు ఎవరో అందరికీ తెలియాలని, తప్పనిసరిగా వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కడప ఎంపీ సీటు కోసమే బాబాయ్ హత్య జరిగిందని, ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్నప్పుడు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో షర్మిలపై సీఎం జగన్ ఆగ్రహంతో రగలిపోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే తెలంగాణలో షర్మిల సుధీర్ఘ పాదయాత్ర ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తోంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.కోట్లలో అవినీతి జరిగిందన్నారు. ఈ విషయంపై షర్మిల ఢిల్లీకి వెళ్లి సీబీఐకు ఫిర్యాదు చేసింది. అయితే బాలయ్య టాక్ షోలో షర్మిల ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -