YS Sharmila: షర్మిలకు జగన్ ఇచ్చిన అప్పుల లెక్క ఎంతో తెలుసా.. దొందూ దొందే అంటూ?

YS Sharmila: వైయస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో నష్టం కలిగిస్తుందని చెప్పాలి ఈమె వైసిపి పార్టీకి మద్దతు తెలియజేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన అన్న పైనే విమర్శలు చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. గత ఐదేళ్ల కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధినీ గాలికి వదిలేసారు అంటూ ఈమె విమర్శలు చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే తన అన్నకు పోటీగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి షర్మిల ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈమె ఆస్తుల వివరాలను అప్పులను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. షర్మిల ఇటీవల తన సోదరీ సునీత రెడ్డి తో కలిసి కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ లో భాగంగా ఆఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను అలాగే జగన్మోహన్ రెడ్డి నుంచి ఈమె తీసుకున్న అప్పుల విషయాలను కూడా వెల్లడించారు.

ఈ ఎన్నికల అఫిడవిట్లో భాగంగా షర్మిల ఏకంగా తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి నుంచి ఏకంగా 82 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా తన వదిన భారతి దగ్గర కూడా 20 కోట్ల వరకు అప్పు తీసుకున్నట్టు ఈమె తెలియజేసారు అయితే తన ఆస్తులు రూ. 182 కోట్లుగా ప్రకటించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఆమె ఆస్తులు ప్రకటించలేదు.

ఇలా ఈమె నామినేషన్ వేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పి తీసుకువచ్చారు అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు తాను షర్మిలకు ఇచ్చిన రూ. 82 కోట్ల అప్పు గురించి కూడా తన అఫిడవిట్‌లో చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే పూర్తి వివరాలు చెప్పాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి మరి షర్మిలకు ఇచ్చినటువంటి అప్పును జగన్మోహన్ రెడ్డి చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక జగన్ ఈనెల 23న నామినేషన్ వేయబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -