Health tips: గర్భిణీ స్త్రీలు బరువు పెరిగితే ప్రమాదమా?

Health tips: సాధారణంగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోమని సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా తీసుకునే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించమని చెబుతూ ఉంటారు. ఆహారాన్ని ఎలా పడితే అలా తీసుకోవడం వల్ల అది వారి ఆరోగ్యం పై ప్రభావం చూపడంతో పాటు కడుపులో బిడ్డ పై కూడా ప్రభావం పడుతుంది. మరి ముఖ్య గర్భవతిగా ఉన్నప్పుడు అధిక బరువు పెరిగితే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఊబకాయం ఉన్న మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు మరింత లావు అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో అందుకోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత రోజులో చాలామంది స్త్రీలు మధుమేహం బారిన పడుతున్నారు. గర్భాధారణ తర్వాత మహిళలు ఊబకాయం సమస్యల బారిన పడితే అది మధుమేహం ఇతర దీర్ఘకాలిక సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో వయస్సు మించిన బరువు ఉండడం మంచిది కాదు..ప్రీ-ఎక్లాంప్సియా.. ఈ వ్యాధి తల్లిని, పిల్లను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు గర్భం కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

 

దీని వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాల విఫలం, అవయవాలు చెడిపోవడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్య రావడానికి ప్రధాన కారణాలు గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడమే.
గర్భం దాల్చిన తర్వాత ఊబకాయం సమస్యలతో బాధపడే వారిలో గర్భస్రావం సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాములు బరువు ఉన్న గర్భం దాల్చిన మహిళ కంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్న స్త్రీలే సిజేరియన్ డెలివరీ జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయట. దీని కారణంగా చాలామందిలో ఇన్ఫెక్షన్లతో పాటు సిండ్రోమ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవడం చాలా మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -