Health Tips: భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Health Tips: ఈ మధ్యకాలంలో మనుషులు చాలా బద్ధకస్తులుగా మారిపోయారు. దానికి తోడు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల తొందరగా అలసిపోయి రాత్రి సమయాలలో తిన్న వెంటనే పడుకొని నిద్రపోతూ ఉంటారు. రాత్రి సమయాల్లో తిన్న వెంటనే పడుకుని నిద్రపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వైద్యులు తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేసి ఆ తర్వాత నిద్రపోవడం మంచిది అని చెబుతూ ఉంటారు. అయితే కొందరు రాత్రి తిన్న తర్వాత కచ్చితంగా వాకింగ్ చేసి పడుకుంటే మరి కొందరు మాత్రం తిన్న తర్వాత అలాగే నిద్రపోతూ ఉంటారు.

రాత్రి సమయంలో తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. దాంతో కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అలాగే చెడు కొలెస్టరాల్ శరీరంలో పేరుకుపోయి అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం చేసిన తరువాత కాసేపు నడిస్తే శరీరం చురుకుగా మారుతుంది. ఎందుకంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయి దానిలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో ఎక్కువ భాగం చిన్న ప్రేగులలోనే జరుగుతుంది. భోజనం చేశాక నడిస్తే కడుపు నుంచి చిన్న ప్రేగులకు ఆహారం వేగంగా చేరుతుంది.

 

ఆహారం కడుపు నుంచి పేగులకు వెళ్లిన టైంలో జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయి. అందుకే భోజనం తర్వాత 30 నిమిషాల పాటు కాసేపు నడువాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే వ్యాయామం. మలబద్ధకం వంటి సమస్య ఉత్పన్నం కాకుండా చేస్తుంది. తిన్నాక నడిస్తే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే తిన్న తర్వాత ఆ నడిచి ఆ తర్వాత పడుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -