Evil Spirits: మీ ఇంట్లో నెగిటివ్ గా జరుగుతోందా.. ఆ ఒక్క పని మాత్రం చేస్తే చాలట?

Evil Spirits: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం తగ్గలేదు. ఇల్లు ఇంట్లో ఉన్న మనుషులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. అయితే వాస్తు ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతూ కుటుంబ సభ్యులందరూ కూడా నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇలా జరగటానికి ముఖ్య కారణం మన ఇంట్లో ఉండే దుష్టశక్తి.

 

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల కుటుంబంలో తరచూ ఏదో ఒక సమస్య రావటమే  కాకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం, గొడవలు జరగటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్లయితే ఇలా అనునిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడవలసి ఉంటుంది. అయితే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు కూడా మనకు కనిపిస్తాయి. అటువంటి సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

సాధారణంగా ఇంటి పరిసర ప్రాంతాలలో పచ్చటి మొక్కలు ఉండటం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఇంట్లో నాటుకున్న మొక్కలు ఎండిపోతే అక్కడ పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలాగే మన కుటుంబంలో ఏదో ఒక రూపంలో సమస్యలు తలెత్తడం, కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూడా ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం.అలాగే మన మొదలు పెట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురైనా కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు తెలిపే సంకేతం.

 

 

అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు నెగటివ్ ఎనర్జీని ఇంటి నుండి తరిమేయటానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసి ఉదయం ,సాయంత్రం వేళల్లో దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా బయట పడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఇంట్లో ధూపం వేయటం వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -