Om Raut: ఈ స్థాయిలో రామాయణాన్ని ఖూనీ చేయడం ఓం రౌత్ కే సాధ్యమా?

Om Raut: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా పేరే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు మద్దతు పలుకుతున్న వారు ఎంతమంది ఉన్నారో నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఈ సినిమాపై నెగిటివ్ వార్తలు సృష్టిస్తున్న వారు కూడా అంతేమంది ఉన్నారు. కాగా ఆదిపురుష్ చూసిన వాళ్లు అది రామాయణం కాదు రౌతాయణం అని అంటున్నారు. ఓం రౌత్ తీసిన ఈ చిత్రానికి ఇంతకంటే వేరే పేరేదీ సూటవ్వట్లేదు మరి. డైరెక్టర్ ఓం రౌత్ కీ రామాయణం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల సినిమాను తనకు ఇష్టం వచ్చిన విధంగా మార్చేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

సినిమాలో చాలా సన్నివేశాలు అభిమానులకు హిందువులకు కోపం తెప్పించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మండిపడుతున్నారు. లంకాధీశుడు పుష్పకవిమానంలో తిరిగేవాడని యుగాలుగా చెప్పుకుంటుంటే మన రౌత్ వచ్చి ఆ రావణుడిని గబ్బిలరౌతుని చేసేసాడు. ఆ గబ్బిలానికి ఈయనగారు ఎద్దంత మాంసాన్ని ఆహారంగా కూడా పెడుతుంటాడు. శివలింగం ముందు కూర్చుని స్తోత్రం చేస్తుంటే గొడమీద ఉన్న తన శిల్పాలు కూడా లిప్ మూవ్మెంట్ ఇస్తుంటాయి. ఒక్క గుద్దుతో కొండల్ని పిండిచేయగల ఈ ఓం రౌత్ రావణాసురుడు వీణ వాయిస్తే మాత్రం వేళ్లు తెగి రక్తమోడేటంత సుకుమారుడు.

 

ఒళ్లు నొప్పులొస్తే పాములతో బాడీ మసాజ్ చేయించుకునే వెరైటీ. ఒక తలకి పెడితే పది తలలకీ పెట్టాల్సొస్తుందనేమో అసలు రావణాసురుడికి కీరాటాన్నే పెట్టకుండా గ్రాఫిక్స్ బడ్జెట్ ఆదా చేసిన మేధావి దర్శకుడు ఓం రౌత్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో లక్ష్మణుడు మూర్ఛబోతే విభీషణుడి భార్య సంజీవిని గురించి చెప్పడమేంటి? ఆ ఔషధం వచ్చేదాకా ఆవిడ లక్ష్మణుడికి సపర్యలు చేసి తర్వాత పసరు వైద్యం చేయడమేంటి? ఆ పని చేసింది వానవైద్యుడు కదా! ఇదెక్కడి రౌతాయణం!అయితే అంతో ఇంతో రామాయణం తెలిసిన వాళ్లు హాల్లోంచి బయటికొచ్చి ఓం రౌత్ ని అమ్మనా బూతులు తిడుతున్నారు.

 

అసలు ఓం రౌత్ కీ రామాయణం గురించి ఏ మాత్రం తెలిసుండదు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు సినిమాలు, నాలుగు యానిమేషన్ చిత్రాలు చూసి తన పైత్యాన్ని ధారబోసుంటాడు. అందుకే ఏ మాత్రం భక్తిభావం లేకుండా తయారైంది. దర్శకుడికి తెలియకపోతే సినిమాలో పనిచేసిన మిగతా వారికి ఎవరికీ రామాయణం గురించి సరైన అవగాహన లేదా అతను చెప్తుంటే ఇలా చేశారు అసలు ఈ ప్రాజెక్టు అతనికి ఎవరు అప్పగించారు అంటూ మండిపడుతున్నారు అభిమానులు. చాలామంది ఈ సినిమాను చూసి కోపంతో డస్టర్ బయట కనిపిస్తే మాత్రం కొడతాము అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -