Ram Charan: ఆ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ కు డేట్లు ఇవ్వడం సాధ్యమేనా?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో త్వరలో ఒక పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు బుచ్చిబాబు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి నేపధ్యంగా హీరో పాత్ర డ్యూయల్ రోలనే లీక్ వచ్చింది కానీ ఎంత వరకు నిజం అన్నది తెలియదు. చరణ్ కు శారీరక వైకల్యం ఉండేలా ఏదో షాకింగ్ గా ప్లాన్ చేశారట. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఖరారు చేశారు.

చిత్ర యూనిట్ ఇంకా ప్రకటన ఇవ్వలేదు కానీ మ్యూజిక్ డైరెక్టరే ఇంటర్వ్యూలో చెప్పేసారు. ఇప్పుడు అసలైనది హీరోయిన్ సెలక్షన్. తాజాగా జరిగిన స్లమ్ డాగ్ హస్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు చూచాయగా హింట్ ఇచ్చేశారు. ఏ డైరెక్టర్ అయినా తెలుగు అమ్మాయి దొరికితే అదృష్టంగా భావిస్తాడని, ఉప్పెన కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడంతో రాజీ పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అందుకే తర్వాతి మూవీ కోసం కాంప్రమైజ్ కానని తేల్చేశారు. అయితే శ్రీలీల ప్రస్తావన తెచ్చి ఈ అమ్మాయి బాగుందని స్టేజి మీదే కితాబు ఇచ్చేశారు. అక్కడ పక్కనే ఉన్న శ్రీలీల ముసిముసి నవ్వులు నవ్వుకుంది.

 

రెండింటిని లింక్ చేస్తే చర్చ జరిగినట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో టాప్ డిమాండ్ లో శ్రీలీల మహేష్ బాబుతో ఆల్రెడీ గుంటూరు కారంలో చేస్తోంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు చరణ్ సరసన కూడా ఓకే అయితే హ్యాట్రిక్ జాక్ పాట్ అవుతుంది. ఎలాగూ బుచ్చిబాబు షూటింగ్ మొదలుపెట్టేనాటికి శ్రీలీల ఇప్పుడు చేస్తున్న వాటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. సో డేట్లు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. అడగాలే కానీ అమ్మడు వద్దనే సమస్యే ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -