YS Jagan: జగన్ పోటీ చేసేది అక్కడినుంచేనా.. పులివెందులలో ఇష్టం లేదా?

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి పులివెందుల కంచుకోటగా ఉంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే అది నిన్నటి వరకు ఇప్పుడు ఆ కంచుకోటకు బీటలు బారుతున్నట్టు తెలుస్తుంది. జగన్ అడ్డగా ఉన్నటువంటి పులివెందులలో ప్రస్తుతం జగన్ కి పెద్దగా మద్దతు లేదని అందుకోసమే జగన్ వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

 

వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తే తప్పకుండా ఓటమి ఫాలో అవుతారు అందుకే ఆయన గెలిచే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట అందుకోసం ఇప్పటికే పలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇలా పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత రావడానికి ఆయన కుటుంబ కార్యక్రమాలు చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత పులివెందల రాజకీయాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పులివెందులలో ఎన్నికల బరిలో ఉన్నారు కానీ నేరుగా క్యాడర్ తో దిగువ స్థాయిలో సంబంధాలు కలిగి లేరు. అక్కడి వ్యవహారం మొత్తం అవినాష్ రెడ్డి కుటుంబం చేతుల్లో ఉంది. వైఎస్ కుటుంబంలో చీలిక కారణంగా అవినాష్ రెడ్డి తండ్రి డామినేషన్ పై అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలోపు సునీత కూడా ఏదో పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది.

 

ఈ విధంగా వైఎస్ కుటుంబ సభ్యులలో చీలికలు ఏర్పడటంతో ఓట్లు కూడా చీలిపోయే ప్రమాదం ఉంది ఈ క్రమంలోనే జగన్ ఈ పులి వెందుల నుంచి పోటీ చేసి ఓడిపోవడానికి ఇష్టపడటం లేదని అందుకే ఆయనపార్టీకి మంచి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో పోటీ చేసే గెలుపొందాలని భావిస్తున్నారట. జమ్మలమడుగుతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఐ ప్యాక్ టీములు విస్తృతంగా సర్వేలు చేస్తున్నాయి. బహుశా జగన్ పులివెందుల నుంచి కాకుండా ఈ నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -