Mahesh: ఓజీ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పవన్, మహేష్ కలిస్తే మామూలుగా ఉండదంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. చివరిగా సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాని తెరకెక్కిస్తున్నారు.అయితే ఇప్పుడు మహేష్ బాబు గురించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటికి వచ్చింది. అయితే అది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఒక పవర్ఫుల్ క్యామియో కోసం ఆయనని చిత్ర బృందం సంప్రదించిందట.

అయితే కథ నచ్చినప్పటికీ చేసేది లేదని మహేష్ బాబు చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. మహేష్ బాబు ఇప్పటివరకు అతిధి పాత్రలు ఎప్పుడు పోషించలేదు. త్రివిక్రమ్ మాట కాదనలేక ఒకసారి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా జల్సా కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే తనకి అతిధి పాత్రలు పోషించే ఉద్దేశం లేదని కూడా ఆయన చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇలాంటి ఒక క్యామియో ప్రపోజల్ తో ఆయన దగ్గరికి మూవీ టీం వెళ్లారంటే ఇది ఆసక్తి కలిగించే విషయమే. నిజానికి ఈ మధ్యకాలంలో క్యామియోలు ఒక రేంజ్ లో పేలుతున్నాయి.

విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్ర ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే జైలర్ సినిమాలో నరసింహగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ చేసిన పాత్రకి వచ్చిన రెస్పాన్స్ మనందరం చూసిందే. అయితే ఇప్పుడు అదే ట్రెండ్ ని మన దర్శక, నిర్మాతలు కూడా ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి కానీ ఎందుకో అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. అందుకు ఉదాహరణ ఊహ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ పాత్ర, హ్యాండ్సప్ సినిమాలో చిరంజీవి పాత్ర, అధిపతి సినిమాలో నాగార్జున పాత్రలు.

నిజానికి ఆ పాత్రలకి మంచి స్కోప్ ఉంది అయినా ఎందుకో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. ఇప్పుడు నిజంగా మహేష్ బాబు గనుక ఓజీ ప్రతిపాదన ఒప్పుకున్నట్లయితే కనక మామూలుగా ఉండదు అని అప్పుడే ఫ్యాన్స్ సంతోష పడిపోతున్నారు. కానీ నిజానికి ఇదంతా పుకారే అని కొట్టి పారేస్తున్నారు మహేష్ బాబు సన్నిహిత వర్గం వారు. ఇప్పుడు అతని దృష్టి కేవలం గుంటూరు కారం సినిమా మీదే ఉందని చెప్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -