Venu Swamy: మెగా డాటర్ నిహారిక జాతకం అంత ఘోరంగా ఉందా.. ఏం జరిగిందంటే?

Venu Swamy: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఈమె తన భర్త చైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో నిహారిక పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మెగా అభిమానులు ఏది అయితే జరగకూడదని భయపడ్డారు చివరికి అదే జరగడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ విషయంలో జరిగినట్టుగా జరగకూడదని భావించినప్పటికీ చివరికి పెళ్లి అయి మూడేళ్లు కూడా కాకుండానే భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది నిహారిక.

ప్రస్తుతం మెగా ఇంట్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ఇలా నిహారిక విడాకులు తీసుకోవడం అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఆస్ట్రాలజర్ వేణు స్వామి నిహారిక విషయంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్ కల్యాణ్‌ రెండు సార్లు విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ఇద్దరు భర్తలతో విడిపోయింది. దీంతో ఇప్పుడు నిహారిక జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే నిహారిక చైతన్యతో విడిపోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ముందే చెప్పాడట. ఇప్పుడు నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్లీ పెండ్లి చేసుకున్న సరే విడాకులు తీసుకుంటుందని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఒకవేళ రెండవ పెళ్లి అయినా కూడా నిహారిక కు సంతానం కలగదు అని తెలిపారు. ఆమె జాతకంలో దోషం ఉందని అందుకే ఇలా జరుగుతోందని వేణుస్వామి తెలిపారు. అయితే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో కొందరు మెగా అభిమానులు ఆయనపై విమర్శలు చేస్తుండగా మరి కొందరు నిహారిక జీవితం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు నిజం అవ్వడంతో నిహారిక రెండవ పెళ్లి చేసుకుంటుందా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంటుంది అతనితో కూడా విడిపోతుందా అన్న భయాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -