Megastar Chiranjeevi: ఆ సినిమా చేయడమే మెగాస్టార్ చిరంజీవి పాలిట వరమైందా?

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఒక సినిమా ఇంకా పూర్తవక ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మూవీతో ఇయర్ ప్రారంభించిన చిరు ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో తో మనల్ని పలకరించడానికి ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తమిళంలోని వేదాళం కు రీమేక్ గా తెలుగులో రాబోతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా నెలలో మన ముందుకు విడుదల కానుంది. ఇకపోతే ఒకానొక సమయంలో చిరంజీవి సిని కెరియర్ లో ఘోరమైన పరిస్థితి లను ఎదుర్కొన్నాడు. అప్పట్లో 1995 సంవత్సరంలో అల్లుడా మజాకా చిత్రం తర్వాత బిగ్ బాస్, రిక్షావోడు, ఇద్దరు మిత్రులు, సిపాయి, మృగరాజు, దాడి ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ ఎదురయ్యాయి.

 

ఇక ఈ చిత్రాల మధ్యలో హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా మొదలైన చిత్రాలు విజయం సాధించినప్పటికీ ఇదేమీ మెగాస్టార్ రేంజ్ కి తగ్గ బ్లాక్ బాస్టర్ హిట్స్ కానే కావు. దీంతో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పని ముగిసినట్టే అని అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన మెగాస్టార్ గా నిలబెట్టిన చిత్రం ఇంద్ర. చిరంజీవి ఇదొక అతి పెద్ద మైలు రాయి అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జోడిగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ.అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ పై తెరకెక్కిన ఈ చిత్రం 2020 సంవత్సరంలో విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకున్నది. బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీని సృష్టించింది. అయితే మొదట్లో చిరు నాకు ఫ్యాక్షన్ చిత్రాలు సూట్ అవ్వవవని రిజెక్ట్ చేశాడట, కానీ డైరెక్టర్ బి గోపాల్ మాత్రం ఈ కథకు మీరే 100% కరెక్ట్ అని ఒత్తిడి చేసి మరీ ఒప్పించాడట. ఆ రోజు ఆయన ఆ చిత్రం పట్టాలెక్కించగా చిరు మళ్ళి పుంజుకునేలా చేసింది. ఒక వేళ ఆ చిత్రమే లేకపోయి ఉంటే ఈ పాటికి చిరు రిటైర్ అయి ఉండేవాడు అనే కొందరు సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -