Nani: వామ్మో.. నాని ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్నారా.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Nani: నాచురల్ స్టార్ నాని విభిన్న కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఎంపిక చేశారు.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తండ్రి కూతుర్ల మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో హీరోయిన్ మృణాల్ నాని కూతురి పాత్రలో కనిపించబోతున్నారంటూ ఓ వార్త సంచలనగా మారింది.

 

నాని సైంటిస్ట్ గా కనిపిస్తాడట. ఇక ఆయన కూతురు మృణాల్ ఫ్యూచర్ నుంచి ప్రజెంట్ కి వచ్చేస్తుందట. ఆ సమయం లోనే ఆమె తన తండ్రిని కలుసుకుంటుంది. ఆయనతో పాటు ఎనిమిదేళ్ల వయసులో ఉన్న చిన్నారి కూడా ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి నాని ఫ్యూచర్ కి వెళతాడని తెలుస్తుంది. మరి ఆ సమయంలో నాని ఎవరిని కూతురుగా ఎంపిక చేసుకుంటారని ఈ సినిమా కథాంశం అని తెలుస్తుంది.

 

ఈ విధంగా మృణాల్ నానికి కూతురు పాత్రలో నటించబోతుంది అన్న విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు నాని ఎందుకు ఇలాంటి కథ ఎంపిక చేసుకున్నారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -