Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి అణువంతైనా లాభం ఉందా?

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. నేడు 153వ రోజున ఆయన కొత్తపల్లి గ్రామంలో 2,000 కిమీ మైలురాయిని అధిగమించి తన పాదయాత్రలో మరో రికార్డ్ సృష్టించారు.ఈ క్రమంలోనే బ్రహ్మంగారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ఈయన పాల్గొని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

వైఎస్ఆర్సిపి నేతలు ప్రజలను అణచివేస్తున్నారని తాను ఈ పాదయాత్రలో గమనించిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అణిగి తొక్కారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలను కల్పించారు అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు పోయే నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు.

 

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా లోకేష్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక ఈయన రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. దానిలో కొత్తపల్లి ఆక్వారైతులకు చేయూతనిచ్చేందుకు ఫిషరీస్ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీని పొందుపరిచారు.ఈయన పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో కనీసం 200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయలేరని వైఎస్ఆర్సిపి నాయకులు ఎద్దేవా చేశారు. అయితే లోకేష్ మాత్రం ముందుకు కదులుతూ ఏకంగా 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

 

ఈ విధంగా ఈయన 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా తన పాదయాత్రకు సహకరించినటువంటి కార్యకర్తలు నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.అయితే లోకేష్ 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పటికీ పార్టీకి ఏదైనా ప్రయోజనం కలిగిందా అన్నది పెద్ద ఎత్తున సందేహంగా మారింది. ఈయన పాదయాత్రలో భాగంగా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా వైఎస్ఆర్సిపి నుంచి తమ పార్టీలోకి ఆహ్వానించారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈయన పాదయాత్ర కారణంగా పార్టీకి ఎలాంటి లాభం చేకూరిందన్న సందేహాలను పలువురు వ్యక్తపరుస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -