Pawan Kalyan: పులివెందులలో పవన్ పోటీలోకి దిగుతారా?

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. కీలక పరిణామాల దిశగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలోనే ఆయనను ఓడించేందుకు వైసీపీ కసరత్తులు చేస్తుండటం ఏపీ రాజకీయ పరిణామాలను వెడెక్కిస్తుంది. కుప్పంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టిన క్రమంలో చంద్రబాబు వరుసగా కుప్పంలో పర్యటిస్తుండటం, దానికి పోటీగా సీఎం వైఎస్ జగన్ త్వరలోనే కుప్పం టూర్ కు వెళుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం చిత్తూరు పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇలా చిత్తూరు జిల్లాలో అధినేతల వరుస పర్యటనలతో రాజకీయాలు కాక రేపుతోన్నాయి.

ఈ క్రమంలో మరో వార్త రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పవన్ కల్యాణ్ జగన్ సొంత నియోజకవర్గమైన కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. ఒకవేల పవన్ కల్యాణ్ పులివెందులలో తప్పనిసరిగా పోటీ చేస్తే టీడీపీ కూడా జనసేనానికి మద్దతు ఇస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక సీట్లను చీలనివ్వనని పదే పదే పవన్ చెబుతుండటం, ఏపీలో అందరూ కలవాల్సిన అవసరముందని పొత్తులపై చంద్రబాబు కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో పవన్ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకోసం టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు పొత్తులకు సమయం కాదని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవాలనిప చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దాంతో పొత్తులో భాగంగా పులివెందులలో పవన్ పోటీలోకి దిగితే టీడీపీ ఓట్లు కూడా కలిసే అవకాశముంది. ఆర్ధికపరంగా కూడా పవన్ ను చంద్రబాబు సహయం చేసే అవకాశముంది. టీడీపీ,జనసేన కలిస్తే పులివెందులలో జగన్ కు మెజార్టీ తగ్గించవచ్చనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో జరుగుతోంది.

పవన్ కు ఇప్పటికప్పుడు అధికారంలోకి రావాలనే ఉద్దేశం లేదని ఆయన ప్రసంగాలు, కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. తనకు ఇప్పుటికప్పుడు అధికారంలోకి రావాలని లేదని పవన్ స్వయంగా చాలాసార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినా పెద్దగా బాధపడలేదు. జనసేన గత ఎన్నికల్లో తక్కువ పర్సంటేట్ ఓట్లు సాధించినా పవన్ క్రుంగిపోకుండా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. దీంతో పులివెందులలో పోటీ చేసి ఓడిపోయినా పవన్ పెద్దగా బాధపడరు. కేవలం జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు పవన్ పోటీ చేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో పులివెందులలో 80 వేల ఓట్ల మెజార్టీతో జగన్ గెలిచారు. ఈ సారి అక్కడ పవన్ పోటీ చేస్తే జగన్ మెజార్టీ తగ్గించవచ్చని చెబుతున్నారు. పవన్ సామాజికవర్గం ఓటర్లు కూడా పులివెందులలో ఎక్కువమంది ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలతో పులివెందులలో జగన్ గ్రాఫ్ బాగా తగ్గింది. జగన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ పోటీలోకి దిగితే జగన్ ను ఇబ్బంది పెట్టి పులివెందులలో అధికార వైసీపీని ఇబ్బంది పెట్టవచ్చని చెబుతున్నారు. అధికార వైసీపీ టీడీపీ కంటే జనసేనపై ఎక్కువ దృష్టి పెట్టింది.

పవన్ ను అధికార వైసీపీ ఎక్కువ టార్గెట్ చేస్తోంది. పవన్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విరుచుకుపడుతున్నారు. అలాగే ఏకంగా జగన్ కూడా సభల్లో పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ ఆరోపిస్తున్నారు. ఇక పవన్ కూడా అధికార వైసీపీని ఎలాగైనా సరే ఓడించాలనే లక్ష్యంతో ఎవరితో అయినా కలిసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో పవన్ పులివెందులలో పోటీ చేయాలని పలువురు సూచిస్తు్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -