Pawan Kalyan: అలా కామెంట్లు చేయడం కరెక్టేనా పవన్ కళ్యాణ్.. అసలేమైందంటే?

Pawan Kalyan: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మామూలుగా ఇతర నాయకులకు స్క్రిప్ట్ రైటర్ గా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే. తనతో కలిసి జర్నీ చేసే నాయకులు ఏ సమయంలో ఎలా మాట్లాడాలి అన్నది స్క్రిప్ట్ ప్రకారం రాసి వారితో ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను గమనిస్తుంటే పవన్ పంపిన స్క్రిప్ట్ ని బాబు చదువుతున్నాడు అన్న అనుమానం రాక మానదు. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తన ప్రసంగం మొత్తం కూడా కులాల గురించి మాట్లాడుతుండడంతో అలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. పవన్ మాట్లాడుతుంటే కులాల గోలనే తలపిస్తోంది. మాములుగా ఏ కులాలతో సమావేశమైతే ఆ కులాల వారిని సంతృప్తి పరచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు.

అంతవరకు ఏ నాయకుడికి కూడా మినహాయింపు ఉండదు. అయితే వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తపనపడుతూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బాబు. అందులో భాగంగానే తాజాగా బీసీలతో ఒక సభ పెట్టారు. ఇలాంటి సభలో బీసీలను ఉద్ధరించేస్తాననే మాటలు చెప్పడం సహజం. అలాగే పీ4 అంటూ తానొక కొత్త తారకమంత్రం కనుక్కున్నాడు.ఇప్పుడు ఆ విషయం డప్పు కొట్టుకోవడం కూడా సహజం. కానీ చంద్రబాబు మాటలన్నీ కూడా అచ్చం పవన్ స్క్రిప్టు లాగా సాగిపోయాయి. ఎందుకంటె పవన్ తన ప్రతి ప్రసంగంలో తనకు తెలిసిన కులాల పేర్లన్నీ కాగితంలో రాసుకుని ఆ పేర్లను జాగ్రత్తగా చదివి ఆ కులాలు అన్నింటికీ రాజ్యాధికారం ఇచ్చేస్తాను.

 

మీ ఒక్క కులం ముఖ్యమంత్రి అయితే చాలా అంటూ రంకెలు వేస్తుంటారు. అయితే బాబు పవన్ లాగే మాట్లాడుతున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని కులాల వారికి జనాభా ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంగా మాట్లాడినప్పటికీ బాబు మాత్రం తెలివిగా ఆలోచించి మాట్లాడుతున్నారు మొత్తంగా చూసుకుంటే కులాల దామాషాల్లో నేలబారు మాటలతో ప్రజలను వంచించడానికి పూనుకోవడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -