Poonam Kaur: పవన్ పరువు తీస్తున్న పూనమ్ కౌర్.. ఈ మేడంకు ఇంత పగేంటో?

Poonam Kaur: 2006 లో మాయాజాలం సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమైన నటి పూనమ్ కౌర్. ఆ తర్వాత ఒక విచిత్రం సినిమా కూడా అదే సంవత్సరంలో పూర్తి చేసింది కానీ రెండు ఆమెకి పెద్దగా పేరు తీసుకు రాలేదు. సినిమాల్లోకి రాకముందు ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అభ్యసించింది. 2008లో ఉత్తమ సహాయ నటి అవార్డుకి నామినేషన్ అందుకుంది.

నెంజిరుక్కుం వరై సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది. బందు బలగా సినిమాతో కన్నడ రంగ ప్రవేశం చేసింది. అయితే ఈ సినిమాలు ఏవి ఆమెని ఆమెకి ఒక స్టార్ హోదా తీసుకురాలేదు. ఈమె మిస్ తెలంగాణ ఈవెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమె సినిమా ద్వారా కంటే పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ పై ట్విట్టర్ వేదికగా తన అభ్యంతరాన్ని తెలియజేసింది పూనంకౌర్. పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరుని ఉంచటం అభ్యంతరకరం అంటూ పోస్ట్ పెట్టింది. స్వతంత్ర సమరయోధులను మీరు గౌరవించకపోతే పోయారు కనీసం వారిని అవమానించకండి.

 

ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్లో భగత్ సింగ్ పేరుని పాదాల కింద ఉంచి అవమానించారు. ఇది అహంకారమా అజ్ఞానమా అని ప్రశ్నించారు. మరో ట్వీట్లో మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ని రీ ట్వీట్ చేస్తూ స్వాతంత్ర సమరయోధుడిని కచ్చితంగా అవమానించడం లాంటిదే దీన్ని వెంటనే భగత్సింగ్ యూనియన్ కి రిపోర్ట్ చేయండి అని పేర్కొన్నారు.
అయితే ఈ పోస్ట్ ని చూసిన నెటిజెన్స్ కొందరు ఆమెకి మద్దతు తెలియజేస్తున్నారు కొందరు మాత్రం ఆమెని విమర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ...
- Advertisement -
- Advertisement -