Posani: పోసానికి బుద్ధుందా.. అలాంటి కామెంట్లు అవసరమా?

Posani: తెలుగు సినిమాల్లో యమధర్మరాజు పాత్రకు ఎవరు బాగా సెట్ అవుతారని ఎవరైనా అంటే అది కైకాల సత్యనారాయణ అని అందరూ అంటారు. అటువంటి అభిమానం సొంతం చేసుకున్న కైకాల సత్యనారాయణ తన తుది శ్వాసను విడిచారు. శనివారం కైకాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సుమారు 6 దశాబ్దాల కాలం పాటు కైకాల నట జీవితంలోనే గడపటం విశేషంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాం నుంచి ఇప్పటి తరం వరకు కైకాల ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అందర్నీ తన నటనతో వినోదాన్ని పంచారు.

కైకాల సత్యనారాయణ పౌరాణిక పాత్రల్లో బాగా ఒదిగిపోయారని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు వారికి యముడు అంటే గుర్తుకు వచ్చేది ఆయన మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కైకాల సత్యనారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ , బ్రహ్మానందం లాంటి ప్రముఖులంతా కైకాలకి నివాళులు అర్పించి ఆయనతో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

కాగా ఈ మధ్య తరచూ వివాదాల్లో నిలిచే నటుడుగా పోసాని వైరల్ అవుతున్నారు. కైకాల మృతి గురించి మాట్లాడుతూ పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు. పోసానికి ఇటీవల ఏపీలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి లభించింది. కైకాల మృతి విషయంలో పోసాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కైకాలని పోసాని ప్రశంసిస్తూనే రాజకీయ ఉద్దేశం ఉన్నట్లుగా కొన్ని కామెంట్స్ చేయడం గమనార్హం. చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయతీగా బతికినవాడు కైకాల సత్యనారాయణ అని, కాలం ఉన్నంత కాలం కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంతకాలం బతికి ఉండే నటుడు కైకాల అని ఆయన జోహార్లు అంటూ పోసాని కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కైకాల మరణించిన ఈ టైంలో కూడా పోసాని చెంచాగిరి, డ్రామాలు అంటూ పొలిటికల్ ప్రెస్ మీట్స్ లో వాడే పదాలు ఎందుకు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కైకాల గురించి పాజిటివ్ గానే మాట్లాడాడు కదా అని చెబుతున్నారు. అలా మాట్లాడడం పోసాని శైలి అంటూ ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -