Posani: ఆ రోజు చిరంజీవి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తే నేను కాపాడాను.. పోసాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

Posani:  తెలుగు సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి స్వభావం గురించి అందరికీ తెలిసిందే. అతను దేనికీ భయపడడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో ముందు ఉంటాడు అందుకే చాలామంది అతన్ని మెంటల్ కృష్ణ అంటారు. తనకు తానే ఆ విషయాన్ని ఒప్పుకుంటూ నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళని మెంటల్ కృష్ణ అంటే నేను మెంటల్ కృష్ణ నే అని తనని తాను సమర్థించుకుంటాడు. ఇప్పుడు పోసాని గురించి ఎందుకు అంటే ఈ మధ్య మళ్లీ నిజాలు మాట్లాడి వైరల్ అవుతున్నాడు పోసాని. ఇంతకీ ఏం జరిగిందంటే.

ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు మీకు సీటు ఇచ్చి మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీలో చేర్చుకున్న చిరంజీవి తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద మీరు అన్ని విమర్శలు చేస్తున్నారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయాడు పోసాని. నేను ఎవరిని పనిగట్టుకుని విమర్శించను. వారు నా జోలికి వచ్చారు కాబట్టి నేను వాళ్ళ జోలికి వెళ్లాను. ఒకప్పుడు చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని ప్రతిపక్షాల వారు విమర్శిస్తుంటే చిరంజీవి నాకు కన్నీటితో ఫోన్ చేశాడు.

నా మీద కక్ష ఉంటే నన్ను అనుమను అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని అనటం ఏంటి అంటూ చాలా బాధపడ్డాడు. రాజకీయాల పరంగా పక్కన పెడితే సినిమాల పరంగా నేను చిరంజీవి చాలా క్లోజ్ గా ఉంటాము. అందుకే అతనికి ధైర్యం చెప్పి ఎవరైతే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించారో వాళ్ళందరికీ మీకు నచ్చితే చిరంజీవిని విమర్శించండి అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించవద్దు అంటూ గట్టిగా చెప్పాను. అప్పటినుంచి చిరంజీవి కుటుంబం లో ఆడవాళ్ళ జోలికి ఎవరు పోరు. వాళ్ల కుటుంబాన్ని కాపాడింది నేను అంటూ చెప్పుకొచ్చాడు పోసాని.

అప్పుడు చిరంజీవి గారు ఆనందంగా పోసాని నా గుండెల్లో ఉన్నాడు. వాడు నాకు అంత ఆత్మీయుడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీటన్నింటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. చిరంజీవి ఇంట్లో అంత సమస్య వచ్చినప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళు ఎవరిని అడగకుండా నాకు మాత్రమే ఫోన్ చేసి తన సమస్య చెప్పుకున్నాడు. అదీ అతనికి నా మీద ఉన్న నమ్మకం అని చెప్పుకొచ్చాడు కృష్ణ మురళి. ఇప్పుడు ఈ మాటలు ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -