Posani: లోకేశ్ ఎంతమంది బట్టలూడదీస్తావ్.. పోసాని సంచలన వాఖ్యలు వైరల్!

Posani: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఈయన తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా తాజాగా పోసాని బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి పోసాని ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.

అనంతరం పోసాని మీడియాతోమాట్లాడుతూ.. లోకేష్‌తో తనకు ప్రాణహాని ఉందని, తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తరకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించానని అందుకే లోకేష్‌ ఇగో హర్ట్‌ అయ్యిందన్నారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష​ డ్రామాలు ఆడుతున్నారని పోసాని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిందే టీడీపీనే అని విమర్శించారు. టీడీపీలోకి నన్ను చేర్చుకోవాలని లోకేష్ ప్రయత్నించారు. ఆయన పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారు. నేను చేరనని చెప్పడంతో నాపై కక్ష పెంచుకున్నాడు.

 

నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్‌లో ఉన్నపుడు చంద్రబాబు చెప్పారు. కానీ కాంగ్రెస్ ఒడిపోగానే టీడీపీలో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారు. తరువాత ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు పదవి ఇష్టం లేకపోతే పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తానని ప్రమాణం చేయాలి. లోకేష్ నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుకు చెప్పే వెన్నుపోటు పొడిచారా?. నేను అగ్రెసివ్‌గా మాట్లాడతా కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది నేనే. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడ దీస్తావ్? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు అంటూ పోసాని లోకేష్‌ పై మండిపడ్డారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -