Sharwanand: శర్వానంద్ ఇంత రొమాంటిక్ ఫెలోనా.. భార్య కోసం అలాంటి పని చేశాడా?

Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ తాజాగా ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే. రక్షితా రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు స్నేహితులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా శర్వానంద్ పెళ్లి చేసుకున్న రక్షితా రెడ్డి తండ్రి మరెవరో కాదు తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి.

తాజాగా జూన్ మూడవ తేదీ రాజస్థాన్లోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా 11:03 మూడు నిమిషాలకు రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశాడు శర్వానంద్. ఇది తాజాగా పెళ్లి కావడంతో కొద్దిరోజుల పాటు శర్వానంద్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తోంది. తన భార్య రక్షిత రెడ్డిని ఫారిన్ కంట్రీస్ కి తీసుకెళ్లి సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారట. అంతేకాదు రక్షిత రెడ్డికి శర్వానంద్ మొదటి రాత్రి కానుకగా ఒక డైమండ్ నెక్ సెట్ ను ప్రజెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

అది ఆమె కోసం ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించి మరి ఆమె కి ఇష్టమైన డిజైన్ గా చేసి ఆర్డర్ చేయించి ఇచ్చాడట. ఇకపోతే శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగులో దాదాపు 15 కి పైగా సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని శర్వానంద్ భావిస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -